Wednesday, October 16, 2024

భగవత్‌ కృపకు దివ్యమైన సాధనామార్గం!

ప్రయత్నాద్‌ యతమానస్థు యోగీ సంశుద్ధకిల్భిష:
అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతిం
(భగవద్గీత 6వ అధ్యాయం, 45వ శ్లోకం )

అనేక పూర్వజన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చి న యోగ్యతలతో, ఎప్పుడైతే ఈ యోగులు మన:పూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో, అప్పుడు వారు ప్రాపం చిక కోరికల నుండి పవిత్రమై ఈ జన్మలోనే పరిపూర్ణత పొం దుతారు. ధ్యాన యోగము అనే ఆరవ అధ్యాయంలో భగవా నుడు సాధకుడు ఏవిధమైన సాధనామార్గంలో పయనిస్తే తనను సులభంగా తెలుసుకొని తద్వారా తనను చేరుకోవచ్చు నో వివరించాడు. ఈ సృష్టిలో వున్న సమస్త శక్తులు, తన నుండే ఉద్భవించాయని, దారంలో గుచ్చబడిన పూసల వలె తనయందే స్థితమై ఉన్నాయని శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. ఆయనే ఈ సమ స్త సృష్టికి మూలము. మళ్ళీ ఇదంతా ఆయన లోకే తిరిగి లయమైపోతుంది. ఆయన భౌతిక ప్రాకృతిక శక్తి, మాయ, బలీయమైనది దానిని అధిగమించటం చాలా కష్టము, కానీ, ఆయనకి శరణాగతి చేసినవారు ఆయన కృపకు పాత్రు ల, మాయను సునాయాసముగా దాటిపోగలరు. తద్వారా జీవితంలో స్వశక్తితో పోందలేన టువంటి బ్రహ్మానంద స్థితి, శాశ్వత ఆనందాన్ని పొందడం సులభమవుతుంది.
మనం నిత్యం భక్తితో నిమగ్నమవ్వటానికి, భగవంతుడే అత్యంత యోగ్యుడు. ఎందు కంటే సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వము, సర్వశక్తి మత్వం వంటి దివ్య గుణములను కలిగి, తనే పరమ సత్యమని, అంతిమ లక్ష్యమని, శ్రీ కృష్ణుడు సాధకుల కు ప్రబోధిస్తున్నాడు. ఆయనను మనం పవిత్రమైన మనస్సు తో, చిత్తశుద్ధితో, శరణాగత భావంతో ఆశ్రయిస్తే, ఆయనే తన గురించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఇక ఆయనను తెలుసుకున్న తరువాత మనకు కూడా ఆత్మ జ్ఞానము మరియు కర్మ- క్షేత్ర ము గురించి దివ్య జ్ఞానం అవగతమవుతుంది. ఇందుకు సరై న సాధనా మార్గం ధ్యానమేనని భగవానుడు సాధకులకు మార్గనిర్దేశనం చేస్తున్నాడు.
ఎలాగైతే గాలి వీచని చోట దీపం నిశ్చలంగా ఉంటుం దో, అదేవిధంగా సాధకుడు మనస్సుని ధ్యానంయందు నిలకడతో ఉంచాలి. నియంత్రణ చేయటానికి మనస్సు నిజా నికి చాలా క్లిష్టమైనది, కానీ, అభ్యాసము, వైరాగ్యములతో దీనిని నియంత్రించవచ్చు. కాబట్టి, మనస్సు ఎక్కడికి పోయి నా, దానిని తిరిగి తెచ్చి, భగవంతుని వైపే విడువకుండ కేంద్రీకరించాలి అప్పుడు మనస్సు పరిశుద్ధమై భగవంతుని వైపు అప్రయత్నంగా తిరుగు తుంది. అనేక జన్మలలో పుణ్యకర్మలను చేసి అనేక పాపాల నుండి మానవ జీవితాన్ని చిద్రం చేస్తున్న ద్వందాల నుండి పైన పేర్కొన్న సాధన ద్వారా విముక్తులమైనప్పుడు సాధకుడు అనునిత్యం భగవంతుని దయాపూరిత ప్రేమ, కరుణ, కృపలకు పాత్రుడు అవుతాడు. అందు కోసం సాధకులు భగవంతుని కృపను పొందదమే తమ లక్ష్యంగా నిర్దేశించుకొని తమ సాధ నను తక్షణం ఆరంభించడం ఎంతో అవసరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement