Friday, September 22, 2023

దైవ నిర్ణయాలను మార్చడం మనిషి తరమా

కురుక్షేత్ర సంగ్రామంలో హతమైన సుప్రతీకమనే పేరున్న ఏనుగు మెడ నుండి తెగి పడిన గంట కింద దొరికిన నాలుగు పక్షి పిల్లలను శమీకుడనే ముని తన ఆశ్రమానికి తెచ్చి రక్షిస్తాడు. ఆయన పోషణలో పెరిగి పెద్దవైన ఆ పక్షులు మనుష్య భాషలో మా ట్లాడడం విని ఆశ్చర్యపోయిన శమీకుడు, వాటికి ఆ శక్తి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని వాటినే ఆ మాట అడుగుతాడు. సమాధానంగా తమ కథను ఇలా చెబుతాయి ఆ పక్షులు.
పూర్వం విపులుడు అనే పేరుగల ఒక తపోధనుడు ఉండేవాడు. అతనికి సుకృశుడు, తుంబురుడు అని ఇద్దరు కొడుకులు, తపస్సంపదలో తండ్రితో అన్నివిధాల సరితూగగల ప్రతిభగలవారుగా ఉండేవారు. వారిలో సుకృశుడనే సంయమికి నలుగురు కొడుకులు ఉండేవారు. ఎల్లవేళలా వినయంగా మెలుగుతూ, తండ్రికి సపర్యలు చేస్తూ కాలం గడిపేవా రు. ఒకనాడు వారి వద్దకు ఇంద్రుడు, ఒక ముసలి పక్షి రూపం ధరించి, సుకృశుడి తపో మ#హమను, సత్యవ్రత నిష్ఠను పరీక్షించే నెపంతో వచ్చాడు. ”వింధ్యపర్వతం మీద ఉండగా పెద్దగాలి వచ్చి నా రెక్కలకు దెబ్బ తగిలి మూర్ఛపడిపోయాను. ఎనిమిది రోజులుగా అలా స్పృ#హ తప్పి పడి ఉండి, ఇప్పుడే తెలివి తెచ్చుకుని, ఆకలితో ఇలా వచ్చాను. ఎనిమిది రోజులు గా ఆహారం లేక భరించలేనంత ఆకలిగా ఉంది నాకు. అతిథినై నీ దగ్గరకు గంపెడాశతో వచ్చాను. నాకు సత్వరం ఆహార తృప్తి చేయ”మని సుకృశుడిని అడుగుతాడు ముసలి పక్షి రూపంలో ఉన్న ఇంద్రుడు. ఆ మాటలు విన్న సుకృశుడు ”మంచిదే! నీకు ఇష్టమైన ఆహారం ఏమిటో చెబితే, వెంటనే ఏర్పాటు చేస్తాను” అంటాడు.

తే.గీ. (అనినఁ) బక్షియడిగె మనుజ మాంసము దాని
కాత్మనతఁడు రోసి యకట క్రూర
#హృదయుడవు గదయ్య! #హంసార్జితాహార
మడుగఁదగునెనను విహంగనాథ!
(మారన, మార్కండేయ పురాణము, ప్రథమాశ్వాసం, 69 పద్యం)
ముసలి పక్షి రూపంలో పరీక్షించడానికి వచ్చిన ఇంద్రుడు, ఆహారంగా మనుష్య మాం సం కావాలని అడగగా ఆత్మలో ఎంతో రోత కలిగి ‘ఇదేమి కోరిక? ఏమో అనుకున్నాను, చాలా కఠిన హృదయం కలదానివిలా ఉన్నావే నువ్వు! పక్షివై ఉండి ఇలా #హంసతో తప్ప సం పాదించడానికి అలవికాని ఆహారాన్ని కోరతావా? ఇది నీకు తగినదేనా?’ అంటాడు సుకృశు డు. అంతటితో ఊరుకోకుండా

- Advertisement -
   

కం. ఇది రూపం బిది ప్రాయం
బిదినీపడియెడునవస్థయింకైన శమం
బొదవఁగవలదే మనమున,
నది దుష్టాత్ములకు నేవయస్సునఁగలుగున్‌.
(మారన, మార్కండేయ పురాణము, ప్రథమాశ్వాసం, 70వపద్యం)

”ఇప్పుడు నీ వున్న రూపం ఏమిటి, నీ వయస్సేమిటి, నువు పడుతున్న అవస్థ ఏమిటి? ముసలిదానవు, పైగా దెబ్బ తగిలి రెక్కల బలం పోగొట్టుకుని మూర్చిల్లి, ఎలాగో తేరుకుని బయటపడ్డావు నువ్వు. అలాంటి నీ మన:స్థితి ఎలా ఉండాలి? క్షమాగుణం కలిగి సౌమ్యంగా ఉండాలి. కానీ అలా లేదు. అందుకనే, దుష్టాత్ములకు ఏ వయసులోనూ బుద్ధిరాదు అన్నారు పెద్దలు” అని గట్టిగా నాలుగు చివాట్లు పెట్టి ”అయినా నువ్వు ఎలాంటి దానవైతే నాకేమిటి? అతిథిగా వచ్చావు. ధర్మం ప్రకారం నీవు కోరింది ఇవ్వడం నా విధి’ అని తన పుత్రులను దగ్గర కు పిలిచి, ఆ పక్షికి ఆహారం కమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆ మాట విని భయంతో వణికిపోతూ అని ష్టతను కనబరచిన వాళ్ళను చూసి, తన మాటను ధిక్కరించినందుకు చాలా కోపగిం చిన సుకృశుడు, ఆ ధిక్కారానికి ఫలితంగా వాళ్ళను మలిజన్మలో పక్షిజాతి సంతానం కమ్మని శపిస్తాడు. తరువాత, ఆ ముసలి పక్షికి ఆహారంగా తననే స్వయంగా అర్పించుకుంటాడు. ఆ మాటతో సంతోషించిన ఇంద్రుడు…

మ. తన రూపంబు ధరించి యిట్లను మునీంద్రా! బుద్ది సంమోద మం
దనుబక్ష్యా కృతిఁ బొంది నీ #హృదయ తాత్పర్యం బెఱుగంగ వ
చ్చిన నా తప్పు స#హంపు చేసెద భవచ్చిత్తేప్సితంబెద్ది చె
ప్పునినున్సంతత సత్యపాలనము నంబుణ్యుండుగాఁగాంచితిన్‌.
(మారన ‘మార్కండేయ పురాణము’ ప్రథమాశ్వాసము, 81వ పద్యం)

తన నిజ రూపంలో ప్రత్యక్షమై సుకృశుడితో ‘మునీంద్రా! పక్షిరూపం ధరించి నీ తపో మ#హమను, సత్యవ్రత నిష్ఠను పరీక్షించుదామనే కోరిక పుట్టి ఈ పనికి పూనుకున్న నా తప్పిదాన్ని మన్నించు! నీ మనసుకు సంతోషం కలిగించడం ఇప్పుడు నా విధి. సత్యవ్రత పాలనమనే యజ్ఞంలో ఎప్పుడూ వెనకడుగు వేయక, పుణ్యం సంపాదించుకున్నవాడిగా నిన్ను ఇప్పుడు నేను భావిస్తున్నాను. నీకొక వరం ఇస్తాను!’ అని, ఆనాటి నుండి ఇంద్ర జ్ఞానా న్ని వరంగా ఇచ్చి వెళ్ళిపోతాడు ఇంద్రుడు. కనుల యెదుట జరుగుతున్న చిత్రం చూస్తున్న సుకృశుడి పుత్రులు, తండ్రి మ#హమకు వణికిపోయి, ఆయన కాళ్ళ మీద పడి మొక్కి, తప్పు కాయమని ప్రాధేయపడతారు.

ఉ. నా వచనం బమోఘ మెడ నవ్వుచుఁ బల్కిన దప్పదెన్నఁడున్‌
దైవకృతంబు మానుష #హతంబగు నెట్లు? తనూజులార! దు:
ఖావ#హ మైన పక్షి భవమైనను నిర్మల బోధ మెప్పుడున్‌
మీ విమలాంతరంగముల నిత్యముగాగనను గ్ర#హంచితిన్‌.
(మారన ‘మార్కండేయ పురాణము’ ప్రథమాశ్వాసము, 90వ పద్యం)

”కుమారులారా! నా మాటకు తిరుగులేదు. నవ్వుతూ చెప్పినా అది జరగక తప్పదు. దైవం నిర్ణయించిన ఘటనను సరిచేయడానికి మనిషి ఎంతటివాడు గనుక? అందువలన పక్షి జన్మమని సందేహంచనక్కర లేకుండా మీకు మంచి స్వభావము, నిర్మలమైన అంతరం గమును నిత్యమైనవిగా అనుగ్రహస్తున్నాను” అని వారికి ఊరట కలిగించిన సుకృశుడు, వీటితోపాటుగా పూర్వజన్మ జ్ఞానము, మనుష్య భాషణము కూడా వరంగా ఇచ్చాడు.
”అలా మేము పక్షిరూపంలో ఉన్న వపువు అనే అప్సరస కడుపున పులుగులమై పుట్టి, ప్రమాదవశాన కురుక్షేత్ర సమర రంగంలో పడి, మీ రక్షణలో ఇలా బ్రతికి బయటపడ్డాం” అని శమీకుడికి ఆ ధర్మ పక్షులు చెప్పిన కథ.

Advertisement

తాజా వార్తలు

Advertisement