Saturday, September 21, 2024

సృష్టి ప్రారంభము

మైత్రేయ మహర్షికి విదురుడు ప్రణామం చేసి సృష్టి ప్రారం భం గురించి తెలియజేయమని అడిగాడు. మైత్రేయుడు చిరునవ్వుతో ”ధర్మమూర్తిగా అవతరించిన నీవంటివారికి సృష్టి ప్రారంభాన్ని తప్పకుండా చెబుతాను.” అంటాడు.
”ఇది గొప్ప ప్రళయానంతరం జరిగినది. భూమి అంతా నీటి లో మునిగి వుంది. మహా ప్రళయం సంభవించిన తరువాత నారా యణమూర్తి యోగనిద్రలో ఉన్నాడు. ఆదిశేషునిపై పడుకొని ఉండ గా యావత్‌ ప్రపంచం అతని యందు లీనమై కట్టెలో అగ్ని దాగి యున్నట్లు వుంది. త్రిగుణములు సమ విభక్తముగా నుండుట చేత ఎటువంటి కార్యాలు జరగకుండా అలాగే వుంది. ఆవిధంగా చాలా కాలం వుంది.. తరువాత త్రిగుణములు వ్యక్తమై సమత్వం తప్పిం ది. అప్పుడు నారాయణుని నాభి నుండి సన్నని కాడ వంటిది ఆవిర్భవించింది. ఇది వ్యక్తమైన రజోగుణ స్వరూపము. కొంత కాలానికి అది పెరిగి అందులో నుండి పద్మము వికసించి ప్రకాశిం చింది. ఆ పద్మంలో నారాయణుడు ప్రవేశించి బ్రహ్మగా రూపొం దాడు. తనకు తాను పుట్టినట్లు భావించి బ్రహ్మ వేదాలను క్షుణ్ణంగా తెలిసికొన్నట్లుగా భావించాడు. అటు తర్వాత తాను ఏకాకిగా వున్న ట్లు గుర్తించి విశాలమైన కనులతో చుట్టూ పరికించి చూడగా తన నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తున్నట్లు అనిపించింది.
తన చుట్టూ జలం వున్నట్లు చూశాడు. జలం తప్ప బ్రహ్మకు మరేదీ కనిపించలేదు. సముద్రములో అలలు చేసే శబ్దం మాత్రమే వినిపిస్తోంది. క్రిందకు చూడగా తానొక పద్మముపై కూర్చుని వున్న ట్లు గుర్తించాడు. అప్పుడే బ్రహ్మకు ‘తప… తప…’ అనే శబ్దం వినిపి స్తుంది. ”తపస్సు చేయుము. తపస్సు చేయగా నీవు అన్వేషిస్తున్న దానిని కనిపెట్టగలుగుతావు.” అని వినిపిస్తుంది. అప్పటి నుంచి బ్రహ్మ ఆ పద్మం లోనే కూర్చుని వంద సంవత్సరా లు తపస్సు చేసాడు. అకస్మాత్తుగా అత డు తన మనస్సులో నారాయణుని రూపం చూస్తాడు. ఆ నారాయణుడే పురుషుడని బ్రహ్మ గ్ర హిస్తాడు. నారాయణుని చూసిన వెంటనే బ్రహ్మకు జ్ఞాన ము కలుగుతుంది. అప్పుడు తాను ఏమి చేయాలో అర్థమవు తుంది. నారాయణుని పూజిస్తాడు. అప్పుడు నారాయణుడు ”ప్రపంచాన్ని, అందులో జీవరాశులను సృష్టించే కార్యం నీకు అప్పగిస్తున్నాను.” అని చెబుతాడు. బ్రహ్మ అందుకు అంగీకరిం చి సృష్టి ప్రారంభించాడు.
బ్రహ్మ మనసు నుండి నలుగురు రుషులు- సనకుడు, సనం దుడు, సనాతనుడు, సనత్కుమారుడు జన్మించారు. వారితో బ్ర హ్మ ”మీరు సృష్టి కార్యం చేబట్టి ప్రజోత్పత్తిని గావించండి” అని చెప్పాడు. వారు నారాయణునిలో ఐక్యం కావాలని అనుకొని సృష్టి విస్తరించడానికి అంగీకరించరు. బ్రహ్మకు వారి మీద విపరీతమైన కోపం వస్తుంది. కానీ నిగ్రహించుకుంటాడు. అతనిలోని వివేకం కోపాన్ని అణచి పె ట్టినప్పటికీ, అది మరియొక రూపమున బ్రహ్మ నుదుటిపై ఆవిర్భవించింది. ఆ రూపము (శిశువు) మెరుపు నీల వర్ణం కలిసిన వన్నెతో నుండి, పుట్టిన వెంటనే ఏడ్వసాగింది. నా కొక పేరు, ఉండటానికి స్థలం ఇమ్మని యేడ్చుచుండగా బ్రహ్మ ”ఏడుపు మాను. నీవు జన్మించినది మొదలు ఏడ్చుచుండుట చేత నిన్ను రుద్రుడ”ని పిలిచెదను. హృదయము, ఇంద్రియాలు, ప్రాణము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, సూర్యుడు, చంద్రు డు, తపస్సు ఈ ప్రదేశములున్నాయి. నీవు ఇక్కడ నుండి వెళ్ళి నీ ప్రతిరూపములుగా సృష్టిని జరుపుము.” అన్నాడు. బ్రహ్మ తరు వాత తన శరీరం నుండి పదిమంది పుత్రులను సృష్టించాడు. వారు అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహడు,క్రతువు,భృగువు, దక్షు డు, మరీచి, వసిష్టుడు, నారదుడు, ధర్మము, అధర్మము కూడ బ్రహ్మ నుండి జన్మించారు. అతని నాలుగు ముఖాలు నుండి నాలు గు వేదములు పుట్టెను. తన శరీరము రెండు భాగాలుగా విభజిం చెను. ఒకటి పురుష భాగము, రెండోది స్త్రీ భాగ ము. వారికి స్వాయం భువ మనువు, శతరూపియని పేర్లు పెట్టెను. వారికి ముగ్గురు పు త్రికలు ఆకుంతి, ప్రసూతి, దేవహుతి. ఇద్దరు పుత్రులు ప్రయవ్రతు డు, ఉత్తానపాదుడు. ఆకూతి రుచి అనే రుషిని, దేవాహుతి కర్త మునిని, ప్రసూతి దక్షుని వివాహ మాడెను. వారి సంతతి, ఆ సం తతి ఈలోకమున విస్తరించెను. రుషుల సంతతి అయిన మనం వారి పేర్లు మన గోత్రనామాలుగా చెప్పుకొనుచున్నాము.

– కోసూరు హయగ్రీవరావు
9949514583

Advertisement

తాజా వార్తలు

Advertisement