Sunday, May 5, 2024

శ్రీరాముడు..హనుమంతుడికే ముద్రికనెందుకిచ్చాడు

సీతాన్వేషణ చేయడానికి, శ్రీరాముడికి ఇచ్చిన మాట ప్రకా రం వానర సేనను నలుమూలల నుండి రప్పించిన తరు వాత, తాను రామచంద్రుడి కార్యం నెరవేర్చానని సంతోషించాడు సుగ్రీవుడు. అప్పుడు లక్ష్మణుడు సుగ్రీవుడితో ”రామచంద్రమూర్తి ని చూడడానికి వెళదామా” అన్నాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం అలాగే చేద్దామని అన్నాడు సుగ్రీవుడు. అంతా కలిసి రాముడు వున్న చోటుకు వెళ్ళారు. వానరసేనను చూసి రామచంద్రమూర్తి సుగ్రీవు డిని ప్రేమగా పలకరించాడు. సుగ్రీవుడిని సంతోషంతో కౌగలించు కుని, ఇలా అన్నాడు. ”సుగ్రీవా! ధర్మం, అర్థం, కామం అనేవాటిని వేర్వేరుగా భాగించుకుని, ఏఏ వేళల దేనిని అనుష్టించాల్నో తెలుసు కుని, ఒకటి చేసేటప్పుడు ఇంకొకటి చేయకుండా, దేన్నీ ఉపేక్షించ కుండా వాటిని సేవించే వాడే రాజని కీర్తి వహిస్తాడు. (సుగ్రీవుడు ధర్మార్థాలను సేవించాల్సిన సమయంలో కామం అనుభవించా డని, అది రాజనీతి కాదని ఇక్కడ భావం). ధర్మాన్ని వదిలి, అర్థాన్ని మరిచి, ఎప్పుడూ కామంమీదే ఆసక్తికలవాడు చెట్టు కొనకొమ్మ మీద నిద్రపోయి, నేలమీద పడి మేల్కొన్నవాడితో సమానం. శత్రు వులను చంపుతూ, స్నే#హతులను సంపాదించుకుంటూ, హెచ్చరిక గా ధర్మార్థ కామ ఫలాలను అనుభవించే రాజు ధర్మ మార్గంలో నడిచిన వాడవు తాడు. సుగ్రీవా! ఇది మన పనికోసం ప్రయత్నం చేయాల్సిన సమయం. మం త్రులు, దండనాయకులు, ఇతరులతో ఇప్పుడే సభ ఏర్పాటుచేయి. ఎలా కార్యం ముందుకు తీసుకుపోవాలో ఆలోచిద్దాం” అన్నాడు.
రాములవారి మాటలకు సుగ్రీవు డు ”రామచంద్రా! నాకు పోయిన మహేశ్వర్యం, వానర రాజ్యలక్ష్మి, గొప్ప కీర్తి, ఇవన్నీ మీ అనుగ్రహం వల్ల లభిం చాయి. ఇలాంటి నీకు ప్రత్యుపకారం చేయతలచనివాడు ఎల్లప్పుడూ నిం దించ తగినవాడే. భూమండలంలోకల కోతులను, కొండముచ్చు లను, ఎలుగులను, బలవంతులను పిలిపించాను. వీరంతా సాధా రణమైన కోతులు కావు. కోరిన రూపం ధరించగలవారు. అడవి మార్గాలు తెల్సినవారు. తమతమ సేనలతో వందలు, వందవేలు, వంద లక్షలు, అయుతాలు, శంకువులు, అర్భుదాలు, ఖర్వాలు, మధ్యములు, అంతములు, సాగరములు, పరార్తాలుగా వస్తున్నా రు. దుష్టుడైన రావణుడిని చంపి వీరు నీ భార్యను తెచ్చి నీకు సమ ర్పిస్తారు”. సుగ్రీవుడు చేసిన యుద్ధ ప్రయత్నమంతా తెలుసుకుని రాముడు సంతోషించాడు. ఇలా శ్రీరామ సుగ్రీవులు మాట్లాడుకుం టున్న సమయంలో వచ్చిన వానరసేనతో భూమంతా నిండింది.
పదివేల కోట్ల కోతులు కొలుస్తుంటే శతవలి వచ్చాడు. తారకు తండ్రైన సుషేషణుడు పదివేల కోట్ల సేన కొలుస్తుంటే వచ్చాడు. రుమ తండ్రైన తారుడు కోటి సహస్రాల కోతులతో వచ్చాడు. హనుమంతుడి తండ్రైన కేసరి వెయ్యి అనీకములు కొలుస్తుంటే వచ్చాడు. గవాక్షుడు కోటివేల కపులతో వచ్చాడు. రెండు కోట్ల ఎలుగులతో ధూమ్రుడు వచ్చాడు. పనసుడు మూడు కోట్ల కపులతో వచ్చాడు. నీలుడు పదికోట్ల కోతులతో, గవయుడు ఐదుకోట్ల వానరులతో వచ్చారు. వేయి కోట్ల కోతులతో దరీముఖుడు, మూడు కోట్లతో గజుడు, వేయి కోట్ల కోతులతో అశ్వినీ దేవతల కుమారులు ద్వివి దుడు, మైందుడు, పదికోట్ల కోతులతో జాంబవంతుడు వచ్చారు.
నూరు కోట్ల కపులు సేవిస్తుంటే రుమన్వంతుడు సుగ్రీవుడి ఆజ్ఞానుసారం రాముడి దగ్గరకు వచ్చాడు. నూరు వేల కోట్ల కోతుల తో గంధమాదనుడువచ్చాడు. తారుడు ఐదుకోట్ల కోతులతో వ చ్చాడు. తార కొడుకు అంగదుడు వేయి పద్మాలు, నూరు శంకువు లు సంఖ్య కల కోతులతో వచ్చాడు. ఇంద్రజాను శూరుడు పదకొం డు కోట్ల వానరులు కొలుస్తుంటే వచ్చాడు. పదివేల లక్షల కోతులు కొలవగా రంభుడు వచ్చాడు. రెండు కోట్ల కోతులు సేవిస్తుంటే దుర్ముఖుడు వచ్చాడు. వేయి కోట్ల కోతులు సేవిస్తుంటే హనుమంతుడు వచ్చాడు. నలుడు, వీరులైన ఇతర వానరులు శత లక్ష కోట్ల తో, దదిముఖుడు పది కోట్ల వానరులతో, వహ్నకుముదుడు, రంహుడు, ఉగ్ర శరభుడు మొదలైన వానర సమూహాలు వచ్చాయి.
వీరు కాకుండా కొండల సమూహాల్లో, నదుల ఒడ్డులలో, అడ వుల్లో వుండేవారు వచ్చారు. సుగ్రీవుడు వచ్చిన వారందరి గురించి రామచంద్రుడికి తెలియచెప్పి, వారి క్షేమ సమాచారాలను విచారిం చాడు. వారిని వాళ్ల సేనలతో అడవుల్లో, కొండల్లో వుండమని ఆదే శించాడు. ”ఈ సేన అంతా నీదే. నీ ఆజ్ఞకు లోబడి నీ ఆజ్ఞానుసారం నడచుకుంటారు. ఇక ఏమి చేయాలో సెలవివ్వు. వీరంతా అప్ప చెప్పిన పని చేయడానికి సమర్థులు. వీరందరినీ నేను ఎరుగుదును. అయినప్పటికీ నువ్వు ఆలోచించి తగినవిధంగా వీరితో పని చేయిం చుకో” అని సుగ్రీవుడు రాముడికి చెప్పాడు.
శ్రీరాముడు సుగ్రీవుడిని కౌగలించుకుని ”దశ కంఠుని ఇంట్లో సీతాదేవి బతికున్నదో, లేదో మొదట తెల్సుకోవాలి. ఆమె మరణిం చి వుంటే మనం ఏ ప్రయత్నం చేయలేం కదా? కాబట్టి రావణుడు వుండే ప్రదేశం, సీతాదేవి బతికున్నదా? లేదా? బతికుంటే ఎలా వుంది అనే సంగతి, తెలసిన తరువాతే నువ్వు చేయాల్సిన సహా యం గురించి చెప్తాను. కార్యమంతా నెరవేర్చడానికి నువ్వే సమర్థు డివి. ఎవరెవరిని ఎక్క డికి పంపాలో నువ్వే పంపించు.” అన్నాడు.
వెంటనే సుగ్రీవుడు రామలక్ష్మణుల ఎదుటనే, వినతుడిని పిలి చి లక్షల కొద్దీ వానరులతో తూర్పు దిక్కుగా రావణాసురుడు వుండే స్థలం వెతకడానికి వెళ్లమని చెప్పా డు. తరువాత దక్షిణ దిక్కునకు సమర్థులైన అగ్నికొడుకు నీలుడిని, #హనుమంతుడిని, బ్ర#హ్మ కొడుకైన జాంబవంతుడిని, గజుడిని, సుహోత్రుడిని, గవయుడిని, శరారిని, శరగుల్ముడిని, సుషేణుడు ని, ఋషభుడిని, గవాక్షుడిని, అశ్వనీదేవతల కుమారులైన మైంద ద్ఖ్వివిదులను, గంధమాదనుడిని, విజయుడిని, ఉల్కాముఖుడిని, అంగదుడిని, తదితర ప్రసిద్ధ బలు లను పంపాలని భావించి కొంత సేనను వారికంటే ముందుగానే దక్షిణ దిక్కుకు పంపాడు. తర్వాత సుగ్రీవుడు తన మామ, తారకు తండ్రైన, మహాబల పరాక్రమ వంతుడు సుషేణుడి ని పిలిచి ఆయనతో పాటు మరీచి మహర్షి కుమారుడిని, మారీచుడనే వాడిని, మిగతా మారీచులను, శూరు లను పశ్చిమంగా పం పి, శతవలిని ఉత్తర దిక్కుగా వెళ్ళమన్నాడు.
ఈ విధంగా నలుదిక్కులకు వెళ్ళేవారికి చెప్పాల్సినవి చెప్పిన సుగ్రీవుడు హనుమంతుడిని చూసి, ఇతడివల్లే ఈ కార్యం సాధ్యమ వుతుందని, ఇతడే ఈ పనిని సాధించగల సమర్థుడని నిశ్చయించి, పరాక్రమశాలైన హనుమంతుడితో ఇలా అన్నాడు. ”ఓ వానరోత్త మా! నీళ్లల్లో, నిప్పుల్లో, స్వర్గంలో, ఆకాశంలో, నీ గమనం అనివా ర్యం. నువ్వు వెళ్ళాలనుకుంటే అడ్డం రాగలది, ఆటంకపర్చగలది ఏదీలేదు. ఇది నిశ్చయం. నాకు తెలుసు. అసురులతో, గంధర్వు లతో, దేవతలతో, సర్పాలతో, మనుష్యులతో, కొండలతో, సము ద్రంతో కూడిన ఈ సమస్త భూమండలంలో నీకు తెలియరా నిది వుందా ఆంజనేయా? వేగంలో, తేజంలో, తేలికలో పోవడానికి, బలాతిశయం చూపడానికీ నువ్వు నీ తండ్రితో సమానం! ఓ కపీశ్వ రా! నీ తేజస్సు చూస్తే నీకు సమానమైన ప్రాణి ఈ భూమ్మీద లేదు. కాబట్టి రామచంద్రమూర్తి భార్యను సాధించి మరల తెచ్చే కార్యం నువ్వే చేయాలి. నీకు తప్ప ఇతరులకు అది సాధ్యంకాదు.”
#హనుమంతుడు ఇంత బలశాలి, గొప్పవాడు అని సుగ్రీవుడికి తెలుసు కదా! ఎందుకు అతడిని వాలిమీదకు యుద్ధానికి పంపలే దు? #హనుమంతుడు తనంతట తానే ఎందుకు వాలిని నిరోధించ లేదు? ఇంత బలవంతుడు సహాయుడిగా వుండి కూడా ఎందుకు సుగ్రీవుడు కష్టపడ్డాడు? హనుమంతుడు సుగ్రీవుడి బంటు. స్వామి ఆజ్ఞ లేకుండా ఏదీ చేయకూడదు. తాను వాలిని జయించలేను, అని చెప్పి బంటు సహాయం కోరలేడు కదా! అలా కోరడం తనకు అవ మానంగా సుగ్రీవుడు భావించి వుండవచ్చు. తనంతట తానే వాలి ని నిరోధిస్తే అది సుగ్రీవుడిని అవమానించినట్లే. ఒక వేళ #హనుమం తుడు సుగ్రీవుడి పక్షాన యుద్ధానికి వస్తే వాలి పక్షం వారంతా అత డిని ఎదిరించడానికి వస్తారు. కాబట్టి అన్నదమ్ములే కొట్టుకుని చావనీ అని మిగతావారంతా వూరుకున్నారు. #హనుమంతుడికి కూడా తన బలం తనకు తెలియదు. స్వయంగా దేనికీ సాహసించడు. జాంబవంతుడి లాంటివారు వుండాలి ప్రోత్స#హంచడానికి. #హనుమంతుడికి భయపడడం వల్లే వాలి సుగ్రీవుడిని భయపెట్టా డు కానీ చంపడానికి పూనుకోలేదు. ఇలా సుగ్రీవుడు అంటుంటే రాముడు, సుగ్రీవుడు కార్యభారాన్ని హనుమంతుడి మీద పెడుతు న్నాడు కాబట్టి, అతడే ఈ కార్యం చేసే శక్తి కలవాడని భావించాడు. వెంటనే తన పేరు చెక్కబడిన బంగారపు ఉంగరాన్ని చేతిలో తీసు కున్నాడు. #హనుమంతుడితో ”వానరశ్రేష్టా! దీన్ని తీసుకుని వెళ్ళు. సీతకు చూపించు. ఇది చూపిస్తే నువ్వు నిజంగా నా దూతవేనని భయం లేకుండా నీతో మాట్లాడుతుంది. సుగ్రీవుడు అప్పచెప్పిన పని చేయగల సమర్థుడివి నువ్వే అని నాకు అనిపిస్తున్నది. ఈ కార ణాన దీన్ని నీదగ్గర వుంచుకో” అని అన్నాడు.
రామచంద్రమూర్తికి ఈ ఉంగరం ఎక్కడినుండి వచ్చింది? సర్వం త్యజించిన వానప్రస్థుడు ఉంగరం ధరించవచ్చా? అయితే, రామచంద్రమూర్తి వానప్రస్థాశ్రమం స్వీకరించలేదని అయోధ్య కాండలో చెప్పడం జరిగింది. కైకేయి కోరిక ప్రకారం నారచీరెలు ధరించాడే కాని, మిగిలిన ఆశ్రమ చిహ్నాలను అనుష్టించలేదు. ఆ కారణాన ఉంగరం ధరించడం వల్ల వ్రతభంగం కలగలేదు. కాగల కార్యం ఆలోచించి సుబా#హుడితో మారీచుడిని ఎందుకు చంపలే దో, అలాగే, ఈ ఉంగరాన్ని కూడా పరిత్యజించలేదు. కాని సొగసు కోసం వుంచుకోలేదు. ఇంకో విషయం..ఈ ఉంగరం సీత రాముడికి ఇచ్చింది. వివా#హ సమయంలో వధూవరులు ఉంగరాలు మార్చు కునే ఆచారం ఇప్పటికీ వుంది. దాని విలువ మాత్రం కొంచెం చెడిం ది. ఈ ఉంగరాలను భర్త జీవించినంతకాలం భార్య, భార్య జీవిం చినంతకాలం భర్త విడవరాదు. స్త్రీలకు మంగళసూత్రం ఎలాగో, అలాగే, భర్తలకు ఈ ఉంగరం అలాంటిది. తక్కినవన్నీ త్యజించిన ప్పటికీ దీన్ని మాత్రం త్యజించకూడదు. దాన్ని త్యజించడం అంటే భార్యను త్యజించినట్లే. ఆ కారణాన రాముడు దాన్ని విడవకుండా ధరించాడు. సీతాదేవిని నమ్మించకలిగింది మరేదీ లేదు కనుక, రాముడి వేలుకుండే ఉంగరాన్ని, సీత ఎప్పుడూ చూస్తుండే ఉంగ రాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు.
శ్రీరాముడిలా చెప్పగా, హనుమంతుడు ఉంగరాన్ని తీసు కుని, శిరం మీద ధరించి, రాముడి పాదాలకు నమస్కరించి నిల బడ్డాడు. తరువాత ఆయనతో సహా వానరులు అందరూ భక్తితో, తమ ప్రభువు ఆజ్ఞానుసారం పెద్ద మిడతల దండులాగా కదిలారు. వానరులంతా ఎవరికి వారే తామే సీతను వెతుకుతామనీ, సీతను వెతికి తెస్తామనీ కేకలు వేయసాగారు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

– వనం జ్వాలా నరసింహారావు
8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement