Saturday, April 27, 2024

శక్తి స్వరూపిణి బతుకమ్మ

ప్రతి పండుగ పరంపరానుగతంగా ప్రత్యేక శైలిలో, విశిష్ట పద్ధతిలో జరుపుకునే ధార్మిక కార్యాచరణాసక్తుల నిల యమైన తెలంగాణలో ఆపురూప సోదరీమణులైన జ్యేష్టాదేవి, లక్ష్మీదేవిలను కొలుస్తూ, బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలను భక్తిశ్రద్ధలతో, పిల్లాపాపలతో కలిసి మహళలు జంట పండుగ లుగా పక్షం రోజుల తేడాతో నిర్వ#హంచడం సాంప్రదాయం. బతుకునిచ్చే తల్లిని లక్ష్మీ గౌరి దేవిలను అభేదిస్తూ, శక్తి రూపం గా ఆటపాటల ద్వారా పూజిస్తూ, రకరకాల పదార్థాలను నివేదిస్తూ జరుపుకునే పండుగ బతుకమ్మ. బతుకమ్మను పేర్చే విధానం, పూజించే తీరును బట్టి, తనను ఆరాధించడానికే శక్తి మాత ఆ రూపాన్ని కోరిందా అని అనిపిస్తుంది. శ్రీ చక్ర ఉపాసన సర్వోత్కృష్టమైన శక్తి ఆరాధన విధానాలలో ఒకటి. బతుకమ్మ ను పేర్చేటప్పుడు, కమలం షట్చక్షికం/ అష్టదళ పద్మాన్ని వేసి పేర్చడం ఆనవాయితీ. శ్రీచక్రంలోని మేరు ప్రస్తానం బతుకమ్మ ఆకారాన్ని పోలి ఉంటుంది. శ్రీచక్రంలోని కుండలినీ యోగ విశేష శక్తిగా బతుకమ్మలో గౌరమ్మను నిలపడం చేస్తారు. ప్రధా నంగా తెలంగాణ స్త్రీలు గౌరమ్మను, గౌరీ, లక్ష్మి సరస్వతులుగా త్రిగుణాత్మ స్వరూపిణిగా భావించి పూజిస్తారు.
”శ్రీలక్ష్మి నీ మహమలూ గౌరమ్మ భారతి సతివయ్యి బ్రహ్మకిల్లాలిపై పార్వతిదేవివై పరమేశు రాణివై, భార్యవైతివి హరునకు గౌరమ్మా” అంటూ పాడుకోడవడం విశేషం. మహా లయ అమావాస్య లేక ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తూ, ఆనాటితో ప్రారంభించి మహర్నవమితో ముగుస్తుంది బతు కమ్మ పండుగ, ప్రతిరోజు ఒకరిని మించి మరొకరు పోటీలు పడుతూ తంగేడు, గునుగు, బంతి, గన్నేరు, కట్ల, గోరింట, గుమ్మడి తదితర పూలతో పసుపు గౌరమ్మ దేవతా విగ్రహాన్ని పళ్ళెములో అందంగా, ఆకర్షణీయంగా పేర్చుతారు. ఊరి బయటకు, జలాశయాల వద్దకు వెళతారు. మధ్యలో బతు కమ్మలను ఉంచి వృత్తాకారంలో ఆడుతూ, పాడుతూ నృత్యం చేస్తారు. వెంట తెచ్చుకున్న తిను బండారాలను ముందుగా నైవేద్యం పెట్టి, బతుకమ్మను నీటిలో నిమజ్జనం గావిస్తారు. ఒకరికొకరు ప్రసాదాలను పంచుకుంటారు.
బతుకమ్మ పండుగ సామూహక భాగస్వామ్యాన్ని పెం పొందించగలదు. ఆ పరిపూర్ణ విశ్వాసంతోనే బతుకమ్మ వేడుక లను మహళలందరూ కలిసికట్టుగా ఆనం దోత్సాహాలతో జరుపుకుంటారు.

– రామ కిష్టయ్య సంగనభట్ల
9440595494

Advertisement

తాజా వార్తలు

Advertisement