Friday, April 26, 2024

శక్తి – భక్త్తి -ముక్తి – లక్ష్మీదేవి కనుబొమల కదలికలలోనే సకల సృష్టి

పరమాత్మగా చెప్పబడే శ్రీమన్నారాయణునికి అన్ని వేళలా అన్ని కార్యాలను సమకూర్చేది శక్తియే. ఈ జగత్తునంతా ఆమెయే రక్షిస్తుంది. అంటే చూస్తుంది. కటాక్షిస్తుంది. లక్ష్యంగా చేసుకుంటుంది కనుక ‘లక్ష్మి’ అయింది. శ్రీమహావిష్ణువు భావమును ఆశ్రయిస్తుంది కనుక శ్రీ అని వ్యవహరిస్తారు. ఆమెను పద్మ, పద్మమాలినీ అంటారు. అందరికీ కోరికలను ప్రసాదిస్తుంది కనుక ‘కమల’ అయింది. శ్రీమహావిష్ణువు సామర్థ్యరూపంగా ఉండటం వలన విష్ణుశక్తిగా పేర్కొనబడుతుంది.

‘యత్‌ భ్రూ భజ్గా: ప్రమాణం స్థిరచర రచనా తాతరమ్యే మురారే’….అని శ్రీ పరాశర భట్టర్‌వారు ఉద్భోధించారు. అంటే పరమాత్మ చేసే సృష్టిలో కొన్ని స్థావరములు. కొన్ని జంగమములు. కొన్ని కదలనివి. కొన్ని కదిలేవి. అందరినీ సృష్టించువాడు పరమాత్మయే అయినపుడు ఈ సృష్టిలో ఈ తారతమ్యాలెందుకు? అన్న సందేహం సహజం. స్వామి సృష్టిలో తారతమ్యం అంతా అమ్మవారి(లక్ష్మీదేవి) కనుబొమల కదలికలలో కలదట. కనుబొమలు ఎగురవేసినట్లయితే దేవతులగాను, కొంత తక్కువగా ఎగురవేస్తే మానవులుగాను, కిందకి చేసినట్లయితే దానవులుగాను, అసలే కదల్చకుంటే పశువులుగాను సృష్టిస్తాడని భావం. జీవుల కర్మవిశేషాలనే ఆ కనుబొమల కదలలికలు తెలియజేస్తాయి. ఉత్తమ కర్మలు చేసి ఉంటే సంతోషంగా కనుబొమల నగురవేస్తుంది. తక్కువ మంచిపనులు చేసివుంటే కొద్దిగా ఎగురువేస్తుంది. పాపాలు చేసి ఉంటే కనుబొమలు వాల్చటం జరుగుతుంది. అంటే స్వామి చేసే సృష్టికార్యములో అమ్మ ఉపయోగపడుతుందని తెలుస్తోంది.

ఇక స్వామిరక్షణలో అమ్మ పురుషకార రూపం గా ఉపకరిస్తుంది. అలాగే సంహారంలో మహాకాళిగా సహకరిస్తుంది. జీవుల కర్మలను లక్ష్యంగా చేసుకొని సృష్టికార్యంలో సహకరిస్తుంది కనుక శ్రీ మహాల క్ష్మిగా చెప్పబడుతుంది. అలాగే రక్షణలో శ్రీదేవిగా పేర్కొనబడుతుంది.

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement