Sunday, May 5, 2024

వివేకమే స్నేహానికి ఆదర్శం

మనం చూస్తూంటాము .చాలామంది పైకి చాలా మంచిగా ఉంటూ ప్రియమైన మాటలు చెపు తూ మంచి వారుగా సౌమ్యులుగా కనపడుతూ, మనకు తెలియకుండానే వెనుక గోతులు తీస్తుంటారు. మరికొంతమంది, ఎప్పుడూ నిర్కర్షగా, కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతూ, అసౌమ్యులుగా కనిపిస్తుం టారు. ఇటువంటి వ్యక్తుల వద్ద నుండి ఆపదలు తక్కువే! ఈ ఉపాఖ్యానాన్ని చదివి మనుషుల వ్యక్తిత్త్వం ఎలా ఉంటుందో ఆలోచించండి. ”పురిక” అనే రాజ్యాన్ని ”పౌరికుడు” ఆనే రాజు పరిపాలిస్తూండేవాడు. అతడు దుష్టస్వభావి. ఎన్నో అకృత్యాలు చేస్తూ ప్రజలను ఇబ్బం దులకు గురిచేసేవాడు. కొంత కాలానికి, మరణించి, మరో జన్మ ఎత్తాడు. ఈ జన్మలో నక్కగా జన్మించి, పూర్వ జన్మలో చేసిన అకృత్యాలు స్ఫురించి, ”ఇక నేను మాం సం ముట్టనని, మానవత్వంతో ఉంటానని వ్రతం పట్టా డు. ఆ అడవిలో రాలిన పళ్ళు, ఆకులు, కాయలు తిం టూ ఉంటే తోటి నక్కలు ”ఇదెక్కడి నియమం. మేమం తా నీకు మాంసం తెచ్చి పెడుతూంటాము. తిని. సుఖం గా జీవించవచ్చు కదా.’ అని అంటే, సవినయంగా తిర స్కరించింది నక్క. క్రమంగా ఈ విషయం అడవి రాజు పులికి తెలిసి తనే స్వయంగా నక్క వద్దకు వచ్చింది.
‘నీవు మంచివాడవని, అహిసావ్రతాన్ని అవలం బిస్తున్నావని తెలిసింది. నాకు సలహాదారుగా, మిత్రుడు గా ఉండు. నేను క్రూర మృగాన ని తలపోస్తున్నారు. నీ సాన్నిహత్యంతో ఆ భావాన్ని తరిమికొట్టాలి.” అంది.
వెంటనే నక్క బదులిస్తూ ”రాజా! నా మనస్సు సుఖాల మీదకు పోకుండా ఉంది. సౌకర్యాలు అనుభవిం చకపోతేనేమి, నీకు మంచిచెడ్డలు చెపుతూ స్నేహంగా ఉంటాను. మన స్నేహాన్ని నీ ఇతర స్నేహతులు, నీ జాతి వారు ఓర్వలేక మన ఇద్దరి మధ్య వైషమ్యాలు కల్పి స్తారు. చెప్పుడు మాటలు వినకుండా ఉంటానని ప్రమా ణం చేయి.” అనగానే పులి బదులిస్తూ, ”ఎంతో సంతో షంగా, గౌరవంగా నిన్ను చూసుకొంటాన”ని ప్రమాణం చేసింది. నక్క పులికి హతవాక్యాలు చెపుతూ దాని గుహ ప్రక్కనే మరోగుహలో ఉండసాగింది. పులి నక్కను ఆప్యాయంగా చూడడం, నక్క ఎంతో విచక్షణతో మం త్రిత్వాన్ని నిర్వర్తించడమూ పులి స్నేహితులకు నచ్చ లేదు. వారిద్దరిని విడగొట్టాలని పన్నాగం పన్నా రు. పెద్ద పులి తినే మాంసాన్ని, వాళ్ళు ఎత్తుకెళ్ళి, నక్క లేని సమ యంలో అది నివసించే గుహలో ఒక మూల పడేసారు. రోజూ పులి తినే ఆహారాన్ని భద్రపరచే బాధ్యత నక్కదే. యథావిధిగా నక్క భద్రపరచిన చోట మాంసం కనప డక పోయేసరికి, నక్క పులిరాజుకు తెలియచేసింది. పులి తన పరివారంచేత వెతకడం ప్రారంభించింది. వాళ్ళు పన్నిన పన్నాగం కాబట్టి కాసేపు ఆగి నక్క గు#హలో పడ వేసిన మాంసం పట్టుకు వచ్చి, వారంతా ”నక్కేమిటి? మాంసం ముట్టనని నియమం ఏమిటి? జిత్తులమారిది అ#హంస, ధర్మం అనే మాయ ముసుగులు తొడుక్కొంది సుమా!” అని పులిరాజుకు చెప్పేసరికి, వారిమాటలు నమ్మిన పులి, కోపంతో ”అదెక్కడ ఉన్నా పట్టుకుని చంపే యండి” అని ఆజ్ఞాపించింది. ఇదంతా విన్న పులి తల్లి, ”నువ్వు ఎంత మూర్ఖుడువి. నీ ఆలోచన, నీ తెలివి ఏమై పోయాయి? ధర్మం అధర్మంలా, సత్యం అసత్యంలాగ కనిపించవచ్చు. ధర్మం ఇదీ అని తెలుసుకోదలచినవా డు మంచి మనస్సుతో ఆలోచించాలి. ఈ నక్క వచ్చిన ప్పటి నుండీ తన నడవడికను గమనిస్తూనే ఉన్నావు కదా! ఇంతలోనే అలా చేస్తాడని ఎలా నమ్ముతావు? వంచకుల మాటలు నమ్మి, ఏమీ ఆలోచించకుండా, చంపేయమని ఆజ్ఞాపించావు? రాజైనవాడు, వెనుక- ముందు ఆలోచించాలి.” అంది.
తల్లి మాటల్లోని వాస్తవాన్ని గ్రహంచి, నక్కను తీసుకురమ్మని కబురు పంపింది. వచ్చిన నక్కను అక్కున చేర్చుకొంది పులి. అప్పుడు నక్క”పులిరాజా! నీవు చేసిన బాసలు మరచి, నన్ను అవమానించడం ఏమీ బాగోలేదు. నీకు శలవు” అని.పలికి నక్క పులిని వదిలి పెట్టి అడవిలోకి వెళ్ళి, తన దీక్షను కొనసాగిస్తూ, కొంతకాలానికి మరణించి, పై లోకా లకు వెళ్ళిపోయింది.

– అనంతాత్మకుల రంగారావు
7989462679

Advertisement

తాజా వార్తలు

Advertisement