Tuesday, May 21, 2024

బ్రహ్మాకుమారీస్‌.. నేను పురుషార్థిని, ఇపుడు సంపూర్ణుడను కాలేదు గదా? (ఆడియోతో…)

మనిషి తన స్వరూపమును మరియు శివబాబాను మరిచిపోయే ని ర్లక్ష్యము యొక్క ఒక గుర్తు లేక స్వరూపాలు చాలా వున్నాయి.

ఉదా:- అతడు ”నేను పురుషార్థం చేస్తున్నాను. నేనేమైనా సంపూర్ణడను అయ్యానా? ఇపుడు నాలో ఏదో ఒక లోపాలుంటూనే ఉంటాయి” అని ఆలోచిస్తుంటాడు. ఈవిధంగా ఉల్టా ఆలోచించి తన సంపూర్ణ స్థితిని ఇంకా వెనుకకు త్రోసి వేసుకొంటాడు. ఇపుడే ”నేను సంపూర్ణంగా అయ్యే లక్ష్యం ఎదురుగా పెట్టుకొని పూర్తి ప్రయత్నం చేయాలి. లేకపోతే సంపూర్ణంగా అగుటకు మరొక సమయం రాదు” అని ఆలోచించడు. ఇంతే కాకుండా పురుషార్థి అంటే పొరబాట్లు చేసేవాడు, లేక సోమరివ్యక్తిఅని అర్థం కాదు.నిజమైన పురుషార్థి అంటే ఒకసారి చేసి న పొరబాటు మరల చేయనివాడు లేక సైగమాత్రంతో తన లోపమును గ్రహించి దానిని పూర్తిగా సరి చేసికొనే ప్రయత్నంలో తన లోపమును గ్రహించి దానిని పూర్తిగా సరి చేసికొనే ప్రయత్నంలో నిమగ్నమై యుండే వాడు అని అర్థం. పురుషార్థం (పురుష, అర్థం) యొక్క భావం ఆత్మకోసం తన ఆత్మహితం కోసం, ఆత్మిక కళ్యాణమును సదా ధ్యాసలో నిలుపుకొని ప్రకృతితో అనాసక్తుడై సదా పురుషత్వం అనగా ఆత్మనిశ్చయంలో ఉంటాడో అతడే పురుషార్థి. ఆత్మను ఆత్మ హితమును మరిచి ప్రాకృతికమైన దేహంలోనే కూరుకొనిపోయేవాడు పురుషార్థి ఎలా అవుతాడు? శివబాబా ఆజ్ఞను ఉల్లంఘించే అతనిని పురుషార్థి అనవచ్చా? శివబాబా మన పురుషుల (ఆత్మల) కళ్యాణార్థమే ఆజ్ఞాపిస్తారు. మనకు ఉద్యోగ వ్యాపారాలు చేసేవాళ్ళమని తెలుసు కాబట్టే కేవలం 8 గంటలకు ఈశ్వరీయ స్మృతి చేయమన్నారు. కానీ 16 గంటలని చెప్పలేదు. శివబాబాకు ఇంటి పనులు, ఆఫీసు పనులు, వ్యాపారం పననులు ఉంటాయని తెలియదా? ఇవన్నీ ఆయన గ్రహించియే ఎనిమిది గంటలు స్మృతి చేయండని చెపితే చేయకపోతే మనం శివబాబా కంటే ఎక్కువ తెలివి కలవాళ్ళం అని భావించే వాళ్ళం కావచ్చు. ఆ పరమాత్ముని ఆజ్ఞను మరియు మన భవిష్యత్తును గురించి లెక్కపెట్టనంత నిర్లక్ష్యపరులం మనం కావున ఇప్పటికైనా పురుషార్థి యొక్క యధార్థమైన అర్థ మును గ్రహించి చ క్కని పురుషార్థం చేయాలి.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement