Friday, May 3, 2024

బ్రహ్మాకుమారీస్‌.. ఆత్మిక నషా (ఆడియోతో…)

మీరు ఈ విధంగా ఆత్మ నిశ్చయం యొక్క లాభాన్ని గ్రహించి అదే స్థితి అభ్యాసంలో నిమగ్నమైనపుడు స్వాభావికంగా మీరు ఆత్మిక నషా పెరుగుతుంది. మీరు ఆలోచనా సాగర మధనం చేసి చూచినట్లయితే ఈ మహావాక్‌యతో అన్ని రకాల సమస్యలు కూడా ఒక్క పైస ఖర్చు లేకుండా పరిష్కరించబడతాయి. దీనితో అమూల్యమైన శాంతి లభిస్తుంది. భవిష్యత్తులో కూడా అపారసుఖం లభిస్తుంది. ఇపుడు కూడా సంతోషం ఉప్పొంగుతుంది. మరియు ఆత్మ స్వరూప నిశ్చయంలో ఉపస్థితులగుటవలన ఆత్మిక నషా పెంపొందుట సహజ స్వాభావికమైనదే అవుతుంది. ఆత్మ పరమాత్ముని సంతానం కావున మానవులు తమను తాము పరమాత్ముని సంతానంగా భావించి వికసితోన్ముఖంగా ఉంటారు.

ఆలోచనా సాగర మధనం చేయుట వలన సంతోషం కలుగుతంది. ఆత్మిక నషా వసత్‌ంది. అనే విషయాలు స్పష్టంగా తెలుసుకొన్నారు. వ్యవహారం పరమార్థం మరియు ప్రపంచ సమస్యలు ఈశ్వరీయ జ్ఞాన పాయింట్స్‌తో ఎలా పరిష్కారమవుతాయో గ్రహించాము. దాని వలన సంతోషం ఆత్మిక నషా కూడా పెంపొందుతుందని తెలుసుకొన్నాము. ఇందులో మేము మూడవ లాభం గురించి చెప్పాము. ”ఉన్నతి కలుగుతుంది” అని మన ఉన్నతి కోసం శివబాబా జ్ఞానం, యోగం, దివ్య గుణధారణ మరియు ఈశ్వరీయ సేవ ఈ నాలుగు కావాలని చెప్పారు. కాబట్టి ఏ పాయింట్‌ గురించి మీరు ఆలోచనా సాగర మధనం మొదలుపెట్టారో దాని సంబంధం, వ్యవహారం, పరమార్థం మరియు దేశ సమస్యలను జోడించిన తరువాత మీరు జ్ఞానం, మోగం, దివ్యగుణాల ధారణ, ఈశ్వరీయ సేవతో జోడించాలి. ఇదే ఆలోచనా సాగర మధనం యొక్క పద్ధతి.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement