Friday, May 17, 2024

నేటి రాశి ప్రభ (10-5-21)

మేషం:
పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటు-పోట్లు- తొలగుతాయి.

వృషభం:
మిత్రుల నుంచి విమర్శలు. పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

మిథునం:
కార్యజయం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం:
ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. ఆలయ దర్శనాలు. సోదరుల కలయిక. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశలు ఫలిస్తాయి.

సింహం:
సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణాలు చేస్తారు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో సాధారణంగా ఉంటాయి.

కన్య:
రుణాలు చేయాల్సిన పరిస్థితి. వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల:
నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. కార్యజయం. భూవివాదాలు. సన్నిహితుల నుంచి సాయం
అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవకాశాలు దక్కుతాయి.

వృశ్చికం:
పెద్దల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు:
పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. పనుల్లో గందరగోళం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

మకరం:
కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు.

కుంభం:
పనులలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. చర్చలు సఫలం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి.

మీనం:
పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement