Sunday, May 19, 2024

ధర్మం – మర్మం : తులసీ వైభవం (ఆడియోతో…)

శ్రావణ మాసం సందర్భంగా తులసీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ఇంద్రాది దేవతలు చేత భగవతి అయిన తులసి నిరంతరం సేవించదగినది. ఆ విధంగా సేవించినచో చతుర్వర్గ ఫలమును ప్రసాదించును. స్వర్గలోకమున, మర్త్య లోకమున, పాతాళ లోకమున కూడా తులసి దుర్లభమైనది. తులసి యందు భక్తి కలవారికి ధర్మార్థ కామ మోక్షములు లభించునని పద్మపురాణం ఉత్తరకాండం, ఉత్తరార్ధంలో క్రియాయోగ సారకాండంలో తులసి వైభవంలో వివరించబడినది.

కదాచిత్‌ తులసీం దుగ్దై: శ్రావణ సేచయేత్‌ నర:
తస్య వేశ్మని విప్రర్షే లక్ష్మీర్భవతి నిశ్చలా
గోమై: తులసీ మూలే య కుర్యాత్‌ ఉపలేపనం
సమ్మార్జనంచ విప్రర్షే తస్య పుణ్యఫలం శృణు
రజాంసి తత్రయావంతి దురీ భూతాని జైమినే
తావత్‌ కల్ప సహస్రాణి మోదతే విష్ణు నా సహ

శ్రావణ మాసమున తులసీ వృక్షమును పాలతో అభిషేకం చేసిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నివాసముండును. అలాగే ఈ మాసమున తులసీ మూలమున ఊడ్చి, నీళ్ళు చల్లి, ఆవు పేడతో అలికినచో ఆ ప్రదేశమున ఎన్ని ధూళికణములు దూరమైనవో అన్ని వేల కల్పములు శ్రీ మహావిష్ణువుతో కలసి ఉండుదురు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement