Friday, April 26, 2024

దేవాలయం లేని ఊరు అపవిత్రం!

దేహో దేవాలయ: ప్రోక్తో జీవ: ప్రోక్త స్సనాతన:
త్యజేదజ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్‌”
దేహమే దేవాలయం. జీవుడు ఈశ్వర స్వరూపం.అజ్ఞానమనే నైర్మాల్యాన్ని తీసి వేసి… నీవే నేను అనే భావంతో పూజించాలి.
ఆత్మకు దేహం ఆలయమైనట్లే, ఇంటికి పూజామందిరం, ఊరికి దేవాలయం అటువంటిది, జీవంలేని దేహం, పూజామందిరంలేని ఇల్లు, దేవాలయంలేని ఊరు సమానమే.అవి అపవిత్రములే. కాబట్టి పూజచేయని ఇంటిలోఅడుగుపెట్టరాదు. దేవా లయంలేని ఊరి దారిలో పయనించరాదని, ఆఇండ్లలో, ఆ ఊళ్ళల్లో భోజనం చేయ రాదని, చివరకు పచ్చి గంగ కూడా తాగరాదని శాస్తం చెబుతున్నది. దీనికి నిదర్శ నం కూడా ఉంది. ఒక బాటసారి నడుస్తూ కనుచూపు మేరలో కనబడిన ఒక ఊరిలోకి వెళ్ళాలనుకుని దారిలో కనబడ్డ ఒక మనిషిని ఆ ఊర్లో దేవాలయం ఉందా? అని అడిగాడు. దేవాలయంగాని, చిన్న మందిరంగాని లేవ న్నాడతను. ఆ బాటసారి ‘శివ! శివా!’ అంటూ ఆ గ్రామాన్ని అపవిత్రంగా భావించి, వెను దిరిగి మరో దారిలో వెళ్ళాడు.
ఇటువంటి ధార్మిక విషయాలను గుర్తించే వివేకవంతులు, త్యాగులు, భక్తులు పట్టణాల్లో, పల్లెల్లో, కొండల్లో,కోనల్లో దేవాలయాలు కట్టిం చి నిత్య పూజా కైంకర్యాలకు తగు ఏర్పాట్లు చేసారు. ఆచంద్రార్కం ఆలయాలు స్థిరంగా ఉండాలని, తిరువారాధనలు అవిచ్ఛిన్నంగా సాగుతుండాలని వారి దృఢసంకల్పం. ఈ ధర్మకార్యానికి విఘాతం కలిగించేవారు కాశీలో గోవును చంపిన పాపాత్ములవుతారని కూడా వారు శాసనాలు చెక్కించారు.అప్పటి ప్రజల్లో అటువంటి భయం ఉండేది కా బట్టే ఎవరూ దేవాలయాల జోలికి వెళ్ళేవారు కాదు. దేవాలయాలు సనాతన కాలం నుండీఉండేవే. దేవాలయ నిర్మాణ సంప్రదాయం కొత్తగా ఏర్పడిందికాదు. వాస్తుశాస్త్ర బద్ధంగా శిల్పకళామయంగా నిర్మించినదేవాలయంసర్వారిష్టహారం. సర్వమంగళప్రదం.
దేవాలయ నిర్మాణ కాలం గురించి భిన్నవాదనలు వినబడతాయి. దేవాలయ నిర్మాణం ప్రాచీన కాలంలో లేదని, ఆధునికుల సృష్టి అని చెప్పేవారు లేకపోలేదు. ఆల యాలు అశోకుని కాలానికి ముందే నిర్మించబడినట్లు చారిత్రక కథనం. నగరాల్లో పల్లె టూళ్ళల్లో శివకేశవ శక్తి గణశాది దేవతలకు ఆలయాలు నిర్మించి తీరాలని కౌండిల్యుని అర్థశాస్త్రంలో కనబడుతోంది. దీన్నిబట్టి చాణక్యునికి మునుపే దేవాలయమున్నట్లు తెలు స్తోంది. చంద్రగుప్తుని కాలంలో ఆలయ నిర్మాణం వ్యాప్తి చెందింది. ఆయా ప్రాంతాల లో భిన్నభిన్న సంప్రదాయాలను బట్టి ఆలయ నిర్మాణం జరుగుతూ వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement