Friday, April 26, 2024

గృహస్థాశ్రమంలో అమ్మ

సనాతనం సనూతనంగా వుండటం సహజపరిణామం. మనదైన సదాచారాన్ని కాదనుకుని, విదేశీయమైన సంస్కృతిని మనదిగా చేసుకునే ప్రయత్నంలో విషాదమే మిగులుతుంది. వ్యవస్థలన్నీ రూపాంతరీక రణం జరిగి దురవస్థకు దారితీస్తుంది. నూతన భారతీయంలో వివాహ వ్యవస్థ ఒక పటిష్ట పవిత్ర విధానం. అది ఆరోగ్యకరం, సభ్యసంస్కార సమాజగతిని శాసించే వివాహ వ్యవస్థది. ఈ దేశ సంస్కృతిలో కీలక భూమిక స్త్రీ పురు షులు భిన్న కుటుంబ నేపథ్యాల నుండి వచ్చి, కళ్యాణ కాలం నుండి జీవితం కడవరకు కలసి వుండటం, మిగతా ప్రపంచానికి మార్గదర్శనం చేయిస్తుంది. జనజగత్తుల చేత సాక్షాత్‌ దేవీ స్వరూపంగా ఆరాధింపబడే అమ్మది, అతివర్ణాశ్రమిగా, ఆధ్యాత్మిక స్థితి.
భౌతిక స్థాయిలో కేవలం గృహణిగా భావిస్తే, ఆమె అంతమా త్రమే కాదు. వేదకాలంనాటి పెద్దముతైదువుగా, వ్యవస్థను వన్నెలీ నించిన కళ్యాణ కల్పవల్లి ఒక పెన్నిధిని సన్నిధిగా మార్చుకోవటం పెండ్లి. ఆ పరిణామమే పరిణయం. కళంకర హితంగా వుండటమే కళ్యాణం, గళబద్ధమైన మంగళసూత్రాలు, ధర్మకామం వైపు కలసి నడిపించే పాదాలు.
ఒకరి భావాలను మరొకరు మన్నిస్తూ, మర్యాదతో, సంయ మనంతో, నిబద్ధతతో, పరస్పరాశ్రితులుగా జీవించటమే సంసార జీవనం.భావం తెలుసుకుని భార్య, బాధ్యత నెరిగి భర్తా ప్రవర్తించటమే దాంపత్యం.
దారం, బంగారం కలిస్తే సూత్రం. దారం మార్చుకుంటుం డాలి. మార్పెరగనిది బంగారం. మాలిన్యం లేనిది. బంగారం. అవి దేహాత్మలకు ప్రతిరూపాలు.
ఆలోచన, ఆదరణ కలిస్తేనే శక్తికి నిండుదనం. పురుషుడిలో స్త్రీ, స్త్రీలో పురుషుడు కలిసి వున్నారు. వివాహం, అర్ధనారీశ్వర త్వానికి పతాక. ప్రేమ, భక్తి, సమర్పణ కలిసిన త్రిపుటి.
సర్వాన్నీ స్వాధీనం చేసుకున్నదే సాధ్వి. వివాహ జీవితం, రాజీ పడటం నేర్పదు. సర్దుకుపోవడం నేర్పుతుంది. గృహస్థ జీవితంలో మానవ స్వభావం ప్రభావానికి లోనైనపుడు, పిల్లల పట్ల వాత్సల్యం, అతిథుల పట్ల ఆదరం, భర్త పట్ల వినిర్మల ప్రేమగా ప్రకటితమవు తుంది.
సత్య ధర్మ, శాంతి, ప్రేమ భావనలన్నిటినీ ఆచరణాత్మకం చేసుకోగల వీలు, వివాహ వ్యవస్థలో వున్నాయి. నిజానికి మనిషి దృష్టిలో వున్న ఈ భేదభావం, సృష్టికర్తకు లేదు. ఒకటి లేకుండా మరొకటి మనుగడ సాధించలేదు. బాల్య, కౌమార, ¸°వన, వార్ధక్యాలతో యిమిడి వున్నదంతా ప్రేమే! కానీ భిన్న స్థితులలో…. ఈ మాటలన్నీ ఆధునిక శ్రీ పురుషులు అర్థం చేసుకోవలసినవి. వాటిని ఆచరించు సమస్థితి ఏర్పడి నిత్యశాంతి వెల్లివిరుస్తుంది.
ధర్మబద్ధమైన కామం వలననే భద్ర జాతి ఏర్పడుతుంది. మన స్యేకం, వచస్యేకం, కర్మణ్యకం మహాత్మన:. ఇంట్లో భార్య భర్త బిడ్డ, ఈ ముగ్గురి మధ్యా సమన్వయం ఉంటే ఆ యిల్లు ప్రశాంతి నిలయ మౌతుంది. ఎక్కడ శాంతి వుంటే అక్కడ సుఖం, సంతోషం, ఆనం దం నిత్యవసంతంగా వుంటయ్‌.
ప్రేమించటానికి, పంచుకోవడానికి అనువైన వేదిక, గృహస్థా శ్రమం. జీవితంలో ఏర్పడే సమస్యలు, సవాళ్లు, ఒత్తిడ్తులు సంయో గవియోగాలు, సుఖదు:ఖాలు, జయాపజయాలు, చీకటి వెలు గులు…… వీటిన్నిటినీ కలిసి ఎదుర్కోగల స్థయిర్యాన్ని వివాహ జీవితంలోంచి పొందాలి. ఎందుకంటే, ఇవన్నీ ఉంటేనే జీవితం.
భార్యభర్తగా విడిగా చూస్తే ద్వైతం! ఇద్దరినీ కలిపి చూస్తే అది అద్వైతం. మనసులు కలవటమంటే రెండు భావాలు కలవటం, ఏకసూత్రం, ఏకశిల, ఏకాత్మభావన బలమైనవి. అవి సంఘటిత స్వరూపాలు. అవే ప్రపంచానికి బలం.
పురుషుడి జీవితంలో ప్రవేశించే స్త్రీ అతడి మనసెరిగి వర్తించే మనస్విగా, తలపుల గాఢతతో తపస్విగా, స్వచ్ఛకీర్తితో యశస్విగా, కార్యనిర్వహణలో మంత్రిగా, అన్నం పెడుతున్న వేళ అమ్మగా, బహుముఖీనంగా జీవనాలంబనమౌతుంది. స్త్రీ జీవితంలో ప్రవేశించే పురుషుడు, భద్రతను, ఆధారాన్ని, ఆదరాన్ని, ఆలంబనను కల్పించే భావశక్తిగా వుంటాడు.
తూర్పు పడమరలు ఎదురెదురుగా వున్నా, ఒకే చతుర స్రంలో భాగమై కలిసే వున్నట్లు భార్యభర్తలు వుండాలంటుంది అమ్మ! ఈ పవిత్ర వ్యవస్థలో అత్త, కోడలు ఒక అనివార్యమైన బాం ధవ్యం.
పరస్పర విరుద్ధ భావజాలంతో కలిసి జీవించవలసిన పరి స్థితి. అందుకే అమ్మ ”అత్తగారు తన కోడల్ని కూతురుగానూ, కోడలు తన అత్తగారిని అమ్మగానూ ప్రేమించగలిగితే, అది నిజ మైన అద్వైతం” అన్నది. ఇదొక అధివాస్తవిక దృష్టి. ఆధునిక యువత అమ్మ జీవితాన్ని అర్థం చేసుకుని, జీవించగలితే వివాహ వ్యవస్థ నిలబడుతుంది. స్థితిగతులు, అందచందాలు శాశ్వతం కావు. కలసి బ్రతకటం ఒక అవసరంగా కాక, ఒక ఆధ్యాత్మ విధానంగా దర్శించగలి గితే, దాంపత్య ధర్మం ఏ జాతినౖైెనా నడిపించగల ధార్మిక శక్తి అవుతుంది. ధర్మ బలమంతా అవగాహనలో, ఆచరణలో యిమిడివుంది. ఏ పురు షుడైనా, ఏదో ఒక దశలో తన భార్యను ‘అమ్మా’ అనగలిగితే అది విశిష్ట దాంపత్యానికి గుర్తు!

– వి.యస్‌.ఆర్‌.మూర్తి,
94406 03499

Advertisement

తాజా వార్తలు

Advertisement