Saturday, May 18, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 35
35.
యయా స్వప్నం భయం శోకం
విషాదం మదమేవ చ |
న విముంచతి దుర్మేధా
ధృతి: సా పార్థ తామసీ ||

తాత్పర్యము : ఓ పార్థా! ఇక స్వప్నము, భయము, శోకము, విషాదము, భ్రాంతి యునువానిని దాటలేనటువంటి మందబుద్ధితో కూడిన నిశ్చయము తమోగుణమునకు సంబంధించినట్టిది.

భాష్యము : సత్త్వ గుణముతో కూడినట్టివాడు స్వప్నములను చూడడని భావింపరాదు. ఇక్కడ స్వప్నముగా అధిక నిద్రయని అర్థము. స్వప్నము సహజమై యున్నందున సత్త్వ రజస్తమో గుణములన్నింటి యందును అది కలుగుచుండును. కాని అధిక నిద్రను నివారింపలేనివారు, విషయ భోగములను అనుభవించుచున్నామనెడి గర్వమును వీడలేనివారు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమనెడి స్వప్నమును కలిగియుండువారు, ఇంద్రియ మనోప్రాణములను, నిమగ్నము చేయువారు ఆ విధముగా తమోగుణముతో కూడిన నిశ్చయమును కలిగినవారుగా చెప్పబడుదురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement