Monday, April 29, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 18
18.
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా
త్రివిధా కర్మచోదనా |
కరణం కర్మ కర్తేతి
త్రివిధ: కర్మసంగ్రహ: ||

తాత్పర్యము : జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనెడి మూడు అంశములు కర్మకు ప్రేరణములు కాగా, ఇంద్రియములు, కార్యము, కర్త యనునవి కర్మ యొక్క మూడు అంశములై యున్నవి.

భాష్యము : జ్ఞానము, జ్ఞాన లక్ష్యము, జ్ఞాత అనగా తెలుసుకొనువడు అను మూడు అంశములు ప్రతి రోజు మనము చేయు కరాములకు ప్రేరణను కలిగించును. కర్మ చేయుటకు ఉపయోగించు పరికరములు, కర్మము, కర్మ అనేవి కర్మ యొక్క అంశములుగా పిలువబడును. మనుజుడు చేయు ప్రతి కర్మయు వీటన్నింటిని కలిగి ఉండును. మనుజుడు కార్యమును ప్రారంభించుటకు ముందు కొంత ప్రేరణ అవసరము. ఆ తరువాత ఆ కార్యము ఏ విధముగా చేయవచ్చునో ఊహరచన చేయును. ఇది కర్మ యొక్క సూక్ష్మ రూపమై ఉన్నది. ఆ తరువాత కార్యము చేయబడుతుంది. అనగా ప్రతి కార్యము ముందు ఆలోచన, అనుభవము, సంకల్పము అనునవి చేయవలసి వచ్చును. దినినే ప్రేరణమందురు. అటువంటి ప్రేరణ శాస్త్రము నుండి లభించినా లేదా గురువు ఉపదేశము వలన లభించినా ఒకటే. ఇక అటువంటి ప్రేరణ శాస్త్రము నుండి లభించినా లేదా గురువు ఉపదేశము వలన లభించినా ఒక్కటే. ఇక అటువంటి ప్రేరణ ఉన్నప్పుడు కర్త, మనస్సుతో సహా మిగిలిన ఇంద్రియములను ఉపయోగించి కార్యమును చేయును. కర్మ యందు ఉన్న వీటన్నింటినీ కలిపి కర్మ సంగ్రహము అందురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement