Monday, May 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 14
14.
దేవద్విజగురుప్రాజ్ఞ –
పూజనం శౌచమార్జవమ్‌ |
బ్ర హ్మచర్యమహింసా చ
శారీరం తప ఉచ్యతే ||

తాత్పర్యము: దేవదేవుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, పూజనీయులైన తల్లిదండ్రులు మొదలగువారిని పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస యనునవి శారీరక తపస్సని చెప్పబడును.

భాష్యము: దేవాది దేవుడు ఇక్కడ శారీరిక తపస్సుల గురించి తెలియజేయుచున్నాడు. ప్రతి ఒక్కరు భగవంతునికి, దేవతలకు, పండితులకు, వేద జ్ఞానము కలిగిన వారికి పెద్దలైన తల్లిదండ్రలుకు సరైన గౌరవాన్ని అర్పించుట నేర్చుకొనవలెను. శరీరమును అంతర్గతముగాను బహిరంగముగాను శుభ్రమగా ఉంచుకొనవలెను. సరళమైన ప్రవర్తనను కలిగి ఉండవలెను. శాసత్ర సమ్మతము కానికి చేయరాదు. భార్యతో తప్ప పరస్త్రీతో లైంగిక సంబంధమును కలిగి ఉండరాదు. ఇవన్నీ శరీరముతో చేయవలసిన తపస్సు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement