Thursday, May 9, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 7
7.
ఆహారస్త్వపి సర్వస్య
త్రివిధో భవతి ప్రియ: |
యజ్ఞస్తపస ్తథా దానం
తేషాం భేదమిమం శృణు ||

తాత్పర్యము : త్రిగుణములననుసరించి మనుజుడు భుజించు ఆహారము కూడా మూడు విధములుగా నున్నది. అట్లే యజ్ఞము, దానము, తపస్సులు కూడా మూడు విధములుగా నున్నవి. ఇప్పుడు వాటి నడుమ గల భేదమును ఆలకింపుము.

భాష్యము : వ్యక్తి యొక్క త్రిగుణముల స్థితిని బట్టి వారి ఆహారపు అలవాట్లు, యజ్ఞములు, దానములు మరియు తపస్సులు వేరువేరుగా ఉండును. తెలివి గల వారు ఈ బేధాలను గుర్తించగలుగుతారు. అయితే కొందరు విచక్షణ లేక అన్నీ ఒకటేనని, ఏ విధమైన యజ్ఞము, దానము, తపస్సు చేసినా ఫలితము ఒకటేనని వాదించుదురు. కానీ ఈ శ్లోకమును బట్టి అట్టి వారిలో శాస్త్ర అవగాహన లోపించిందని మనము అర్థము చేసుకొనగలుతాము. శాస్త్ర సమ్మతము కాని స్వంత వ్యాఖ్యానాల వలన వారు ఇతరులను కూడా తప్పు ద్రోవ పట్టించుదురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement