Friday, May 3, 2024

ఐశ్వర్య తృతీయ

హిందూ సాంప్రదాయములో సంవ త్సరంలోని 12 నెలలోను అమావా స్య నుంచి పౌర్ణమి వరకు గల తిథులు విశిష్ట దినాలుగా సంతరించుకున్నాయి. అక్ష య తదియగా ప్రఖ్యాతి గాంచిన వైశాఖ శుద్ధ తది యను గూర్చి తెలుసుకుందాము.
అక్షయ అంటే తరగిపోనటువంటిది. నేడు చేసే పుణ్యకార్యాల ఫలం అక్షయమవుతాయి. ఈ రోజు చేసే దేవ తాకర్మలు, జపదాన, హోమాలు క్షయం కానంత మం చి ఫలితాన్నిస్తాయి. ఈరోజు చేసే దానాలు అనుష్టాన పరులకు, యోగ్యులకు చేసినట్లయితే శ్రీ మహావిష్ణు వు సంతృప్తి చెంది అనుగ్రహిస్తాడని శాస్త్ర వచనం. మనలో జీవుడు మరొక శరీరంలో ప్రవేశించిన తరు వాత కూడా అన్నవస్త్రాలకు లోటు లేకుండా అక్షయ మై సంపదలు కలుగుచేసేదే ఈ పండుగ.
సంకల్ప సహిత సముద్ర స్నానం విశేష ఫలితాన్ని స్తుంది. నక్త వ్రతం, ఏక భుక్తం విశేషము. ఈరోజు పరశు రామ జయంతిగా కూడా కొలుస్తారు. క్లిష్ట సమస్యలకు పరి ష్కారం కావానుకునేవారు ‘పరశురామ స్తుతి’ ఈ రోజు నుంచి మండలం రోజులు పారాయణ చేసినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. రోజంతో ఉపవసించి రాత్రి సమయంలో స్త్రీలు లక్ష్మీదేవిని పూజించి కనకధారాస్తోత్రం, శ్రీసూక్తం, అష్టలక్ష్మీ స్తోత్రం మొదలైనవి పారాయణ చేసినట్లయితే వారి కుటుం బాలు సుఖ సంతోషాలతో వర్థిల్లుతాయి.
జాతక చక్రంలో పితృదోషం ఉంటే, దాని నివా రణకు పరమ పవిత్రమైన పుణ్యదినం అక్షయ తృతీయ. మన కంటికి కనిపించే గ్రహాలు సూర్యుడు, చంద్రుడు. సకల పితృ దేవతలను సూర్య భగవానునిలో దర్శించవచ్చును. అక్షయ తృతీయ శుభకాలంలో పితృ దేవ తలను తలచుకుంటూ అన్నం, నెయ్యి, పప్పు కలిపిన చిన్న ముద్దలను ఎండుకొబ్బరి లో నిక్షిప్తం చేసి ఆ#హుతి చేసినట్లయితే వంశపారం పర్యంగా శుభఫలితాలు పొందవచ్చునని చెబుతారు.
ఈరోజు శ్రీ మహావిష్ణువుకి చందనం సమర్పిస్తే విశ్వ మంతా చల్లగా సుభిక్షంగా వుంటుంది. దేవాలయా లలో ధవళ వర్ణానికి అధిక ప్రాధాన్యమిస్తారు. ధవ ళ పీత వస్త్రాలతో విగ్రహాలంకారాలు చేస్తారు. ఈ రోజు చేసే ఏ దానానికైనా అక్షయ ఫలితం ఉం టుంది. కొన్ని ముఖ్యమైన దానాలు-
స్వయం పాకము – బియ్యం, కంది పప్పు, రెండు కూరలు, చింతపండు, మిరపకా యలు, పెరుగు, నెయ్యి,
వస్త్రదానం – ఎర్రని అంచు కలిగిన పంచెల చాపు, కండువా తాంబూలంతో బ్రాహ్మణునికి దాన మిస్తే వస్త్రాలకు లోటుండదు.
ఉదక దానం – కుండ నిండుగా మంచినీరు నింపి దానం చేస్తే ఉత్తర కర్మ ద్వారా పరలోక యాత్రకు సహకరించే చక్కని సంతానం కలుగుతుంది.
శ్రీ పార్వతీ పరమేశ్వరులను, శ్రీ లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించి, శక్తి మేరకు దానధర్మాదులు ఆచ రించి ఉత్తమ గతులు పొందుదాం. తోటివారిని కూడా సుఖసంతోషాలతో జీవించేలా సహకరిద్దాం. పం డుగలలోని పరమార్థాన్ని గ్ర#హంచి వ్యవహరిస్తే లోకానికి ఎంతో కొంత మేలును చేసిన వారమౌతాము.

  • డా. దేవులపల్లి పద్మజ
    9849692414
Advertisement

తాజా వార్తలు

Advertisement