Friday, May 3, 2024

ఇంద్రుడిని పునీతం చేసిన వైష్ణవ యాగం

ఇంద్రుడు తేజోవిహీనుడై చింతిస్తుండ గా, బ్రహ్మ అతని పాపవర్తనాన్ని ఇలా గుర్తు చేశాడు.
నేను పూర్వం ఒక అపూర్వ సౌందర్య వతిని సృష్టించాను. ఆమెకు అహల్య అని నామకరణం చేశాను. అహల్యకు తగిన వరుడు ఎవరు? అని నేను ఆలోచిస్తున్న ప్పుడు, నీవు దేవనాథుడనే గర్వంతో నా అనుమతి పొందకుండానే అహల్య నాకు భార్య అవుతుంది అని మనస్సులో నిర్ణయిం చుకొన్నావు. ఇది అపరాధమే కదా!
అహల్యకు తగిన వరుని నిర్ణయించే వర కు, ఆమె రక్షణ బాధ్యతను గౌతమునికి అప్ప గించాను. కొన్నేండ్ల పాటు తన సంరక్షణలో ఉన్నప్పటికీ గౌతముడు నిర్వికారుడై తన జితేంద్రియత్వాన్ని నిరూపించుకున్నాడు. ఆమెను పవిత్రంగా నాకు అప్పగించాడు. అతని సద్బుద్ధికి, మనో నిగ్రహానికి మెచ్చి అహల్యను అతని భార్యగా ఇచ్చాను. అహల్య గౌతమునికి భార్య అయినప్పటికీ నీ పాడు బుద్ధిని కామం తొలిచింది. నీవు ఆమెపై మో హాన్ని విడువక కామ పరతంత్రుడవై సత్పు రుషుడైన గౌతముని రూపంలో ఆశ్రమం లో ప్రవేశించావు. నీ స్థాయిని మరచి, కామా సక్తుడవై అహల్యతో విపరీత బుద్ధితో ప్రవ ర్తించావు. వెంటనే గౌతముని కంట పడ్డావు. నీ అధర్మ ప్రవర్తనను చూసి, గౌతముడు కోపించాడు. ”పవిత్రమైన ఆశ్రమంలోకి పాపబుద్ధితో వంచనతో మాయావివై ప్రవే శించి అధర్మానికి ఒడిగట్టావు. నీ గర్వానికి కారణం ఇంద్ర పదవి కదా! ఇంద్ర పదవి నీకు శాశ్వతంకాదు. నీకేకాదు ఎవ్వరికీ కూడ శాశ్వ తం కాదు” అని గౌతముడు శపించాడు. అహల్యను కూడా శపించాడు. అహల్య తన అపరాధం లేదని ప్రాధేయపడింది. గౌతము డు అనుగ్రహించి, ఆమెకు శాప విముక్తుని ప్రసాదించాడు.
”ఇంద్రా! ఈ దురవస్థకు కారణ ం నీ కామవర్తనమే! కామాతురుడ వై కపటివై ప్రవర్తించిన కారణంగా గౌతముని శాపం ప్రాప్తిం చింది. ఆకారణంతో దివ్య తేజస్సును కోల్పోయావు. ఆ పాప ప్రక్షాళనకై నీవు నియ మనిష్టలతో, అనన్య భక్తితో వై ష్ణవం” అనే యజ్ఞాన్ని చేయమన్నాడు బ్రహ్మ. ఇంద్రుడు వైష్ణవం అనే యజ్ఞాన్ని చేసి పునీతుడై, మరల ఇంద్ర పదవిని పొందాడు.
”రామా ఇది ఇంద్రజిత్తు పరాక్రమం! అతడు అనితర సాధ్యమైన వరాలను సాధిం చాడు. తండ్రిని మించినవాడై ముల్లోకాలను గడగడలాడించాడు.ఇంద్రుని బంధించి లం కకు కొనివచ్చాడు. సాక్షాత్తు బ్రహ్మ దేవుడే స్వయంగా లంకా నగరానికి వచ్చి, అతడు కోరిన ప్రతి ఫలాన్ని అర్పించి, ఇంద్రుని బం ధ విముక్తుడిని చేయాల్సి వచ్చింది. ఈ సం ఘటన ఇంద్రజిత్తు పరాక్రమౌన్నత్యానికి ప్రతీక!”అని అగస్త్యుడు రామునికి తెలిపాడు.
రావణుని భంగపాటు
రాముడు రావణుని త్రిలోక విజయ గాథను విని ఆశ్చర్య చకితులయ్యాడు. ”మునీంద్రా! ఒక్కడు కూడా రావణుని జయింపలేక పోయాడా? అని అడిగాడు రాముడు. కార్తవీర్యార్జునుని చేతిలో రావ ణుని భంగ పాటును గూర్చి అగస్త్యుడు ఇలా తెలిపాడు.
”రామా! కార్తవీర్యార్జు నుడు సహస్ర బాహుడు. అమేయ బలపరాక్రమ సంపన్ను డు. అతని రాజధాని మహీష్మతిపురం. అత డు అగ్నిని ఆరాధించి ప్రసన్నుని చేసుకున్నా డు. అగ్నిదేవుడు మహిష్మతిపురానికి రక్షణ వలయంగా ఉండి రక్షణ కల్పించాడు.
ఒకనాడు రావణుడు మహిష్మతిపు రాన్ని సమీపించి, కార్తవీర్యార్జునుని యుద్ధా నికి ఆహ్వానించాడు. మంత్రులు కోట నుండి వెలుపలకు వచ్చి ‘మా రాజు నగరంలో లేడు’ అన్నారు. వెంటనే రావణుడు వింధ్య పర్వ తం చేరాడు. కార్తవీర్యుడు నర్మదానదిలో సుందరాంగులతో జలక్రీడలాడుతున్నాడు.
రావణుడు తన సేనాపతులను, మం త్రులను చూసి, నిరంతరం యుద్ధాలతో అలసిపోయారు. గాయపడ్డారు విశ్రాంతి తీసుకొనండి అన్నాడు. తాను శివారాధన చేయతలచి, నర్మదా నదిలో స్నానమాడి మంత్ర జపం చేశాడు. పిమ్మట నియతవ్రతు డై శివార్చన చేయసాగాడు. అక్కడికి సమీపం లోనే కార్తవీర్యార్జునుడు ప్రియురాండ్రతో జల క్రీడలాడుతున్నాడు. అతడు తన వేయి చేతులనూ నదీ ప్రవాహానికి అడ్డు పెట్టాడు. నదీ ప్రవాహం వెనుకకు మరలి శివార్చన చేస్తున్న రావణుని ముంచి వేసింది. రావణు డు విస్తుపోయాడు. కారణం తెలిసి కొమ్ము అని గూఢచారులు శుక సారణులను ఆజ్ఞా పించాడు. వారు ఆఘమేఘాల మీద ఆకాశ మార్గంలో పయనించా రు. కారణం తెలిసికొని వచ్చి రావణునికి విన్నవిం చారు. ఒంటరిగా చిక్కా డులే! అనుకుంటూ రావ ణుడు సేనాసమేతుడై కార్తవీర్యునిపై దాడి చేశాడు. రావణుడు రాబోతున్నాడనే వార్తను మంత్రులు కార్తవీర్యునికి విన్నవించారు. కార్త వీర్యుడు ఏమాత్రం చలించక, స్త్రీలను, జలకాలాడుతూ ఉండుమని చెప్పి, గదాధ రుడై రావణునిపై విరుచుకుని పడ్డాడు. ఇద్దరూ గదలను గిరగిర త్రిప్పుతూ పోరా డారు. కార్తవీర్యుని గదాఘాతానికి రావణు డు గాయపడి నేల పడ్డాడు. కార్త వీర్యుడు పైకి ఎగిరి రావణునిపై పడి బంధించి సింహ నాదం చేశాడు. రావణుని మాహిష్మతీపురం చేర్చి చెరలో ఉంచాడు.
పులస్త్య బ్రహ్మ కార్తవీర్యుడు రావణుని బంధించాడని విన్నాడు. వెంటనే అప్రమ త్తుడై మాహిష్మతీపురం చేరాడు. పులస్త్యుని రాక తెలిసి, కార్తవీర్యుడు భక్తి వినయ సంభ్ర ముడై ఎదురేగి, స్వాగతం పలికాడు. అర్ఘ్యపా ద్యాలను ఇచ్చి పూజించాడు కార్తవీర్యుడు, ”మహాత్మా, మీ రాకకు కారణమేమి?” అని అడిగాడు. ”నా మనుమడు రావణుని నీవు బంధించావని నాకు తెలిసింది. అజేయు డనని విర్రవీగుతున్న ఆ గర్విష్టి పొగరు అణ గింది. అపకీర్తి పాలయ్యాడు. అమేయమైన నీ పరాక్రమం జగద్వితమయింది. నన్ను చూసి నా మీద గౌరవం ఉంచి, అతనిని బంధవిముక్తుని చేయవయ్యా” అన్నాడు. కార్తవీర్యుడు రావణుని బంధవిముక్తుని చేశాడు. ఇద్దరూ అగ్నిసాక్షిగా మిత్రుల య్యారు.
కిష్కింధరాజు వానరవీరుడు వాలి బల శాలి అని రావణుడు విన్నాడు. కిష్కింధను చేరి, వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. వాలి భార్య తార, కొడుకు అంగదుడు వచ్చి, ”వాలి పోరాటానికి వెనుదీయడు. నీతో పోరాడగలిగిన సమర్ధుడు వాలి ఒక్కడే! కొంచెంసేపు ఓర్పు వహింపవయ్యా! సంధ్యోపాసన చేయడానికి వెళ్లాడు. వెంటనే రాగలడు. నీ ముచ్చట తీర్చగలడు. నీవు ఓర్పు వహించలేకపోతే, దక్షిణ సముద్రంలో మునిగి లేచి సంధ్యోపాసన చేస్తున్నాడు. అక్కడే ఎదుర్కొన తలచితే వెళ్లవయ్యా నీ కోరిక తీరుతుంది” అన్నాడు.
వెంటనే రావణుడు పుష్పక విమానా రూఢుడై దక్షిణ సముద్రం చేరాడు. సవ్వడి చేయకుండా వాలిపై పడి, దొంగదెబ్బ తీయా లనుకున్నాడు. వాలి రావణుడు దుష్ట పన్నా గం పసిగట్టాడు.
రావణుడు తన్ను సమీపంగానే అనూ హ్యంగా వాలి అతడిని ఒడిసి పట్టుకొని, చంక లో ఇరుకించుకున్నాడు. రావణుడు గిలగిలా తన్నుకుంటూ విడిపించుకోవడానికి విఫల యత్నం చేశాడు. వాలి రావణుని దక్షిణ సముద్రంలో ముంచి పైకి లేపాడు. తరువాత తక్కిన మూడు దిక్కుల సముద్రాలలో ముంచి లేపి, ఎత్తుకుని కిష్కింద కు చేరాడు. వాలి చంకలో ఇరుక్కుని సతమతమవు తున్న రావణుని విడిపించడానికి రాక్షస మంత్రులు, సేనాపతులు తీవ్రంగా ప్రయ త్నించారు. సఫలీకృతులు కాలేకపోయారు.
కిష్కింధలో దిగిన తర్వాత ”ఎవడ వురా నీవు? నా జోలికెందుకు వచ్చావు?” అని వాలి ప్రశ్నించాడు.
వాలి పరాక్రమ సంపన్నతను రావణుడు అబ్బురపడ్డాడు. ”నేను లంకేశ్వరుడను, రావణుడను. నేను తలచిం ది ఒకటి. జరిగింది మరొకటి! నీ బల పరా క్రమాలు ఆశ్చర్యకరమైనవి. నేను నీ స్నేహా న్ని కోరుతున్నాను” అన్నాడు. వాలి రావణు లు ఇద్దరూ అగ్నిసాక్షిగా స్నేహం చేసి చేతులు కలిపారు. ”అంతటి వాలిని ఒక్క బాణంతో కూల్చావు కదయ్యా” అని అగస్త్యుడు రాము ని ప్రశంసించాడు.
కె. ఓబులేశు
90528 47742

Advertisement

తాజా వార్తలు

Advertisement