Saturday, April 20, 2024

TS: టార్గెట్‌ 30 డేస్‌.. డ్రగ్స్‌ కట్టడికి స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌.. ఏం చేస్త‌రో తెలుసా!

Hyderabad: వచ్చే 30 రోజుల్లో రాష్ట్రంలో మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా కృషిచేసి.. సీఎం కేసీఆర్‌ ఆకాంక్షను నెరవేరుస్తామని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆబ్కారీ శాఖ అధికారులు రానున్న నెల రోజులు ఇదే లక్ష్యంతో ప్రణాళికాబద్దంగా పనిచేయాలని ఆయన సూచిం చారు.

మ‌త్తు పదార్ధాల సరఫరా, వాటి నిర్మూలనే లక్ష్యంగా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆబ్కారీ శాఖ అధికారులను ఆదేశిం చారు. ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖలో మంచి పని తీరును కనబరిచిన అధికారులను గుర్తించి వారికి అవార్డులు, రివార్డులు అందిస్తామన్నారు.

నగదు ప్రోత్సాహకాలతోపాటు, పదోన్నతుల దిశగా యోచిస్తున్నామని మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌ తెలిపారు. ఆదివారం ఆయన క్యాంప్ ఆఫీసులో పలువురు ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. శనివారం అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.2 కోట్ల విలువైన సుమారు 5 కిలోల మెఫిడ్రిన్‌ డ్రగ్‌ను పట్టుకొని సీజ్‌ చేసిన అబ్కారీ శాఖ అధికారులను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement