Thursday, May 16, 2024

అన్మమయ్య కీర్తనలు : ఇప్పుడిటు కలగంటి

రాగం : బౌళి
8
ఇప్పుడిటు కలగంటి నెల్ల లోకములకు
నప్పడగు తిరువేంకటాధీశు గంటి ||ఇప్పుడిటు ||

అతిశయంబైన శేషాద్రి శిఖరము గంటి
ప్రతిలేని గోపురప్రభలు గంటి
శతకోటి సూర్యతేజములు వెలుగగ గంటి
చతురాస్యు పొడగంటి చయ్యన మేలుకొంటి ||ఇప్పుడిటు ||

కనకరత్న కవాట కాంతు లిరుగడ గంటి
ఘనమైన దీపసంఘముల గంటి
అనుపమ మణిమయమగు కిరీటము గంటి
కనకాంబరము గంటి గ్రక్కున మేలుకొంటి ||ఇప్పుడిటు ||

అరుదైన శంఖచక్రాదు లిరుగడ గంటి
సరిలేని అభయ హస్తమును గంటి
తిరువెంకటాచలాధిపుని జూడగ గంటి
హరిగంటి గురుగంటి నంతట మేలుకొంటి ||ఇప్పుడిటు ||

Advertisement

తాజా వార్తలు

Advertisement