Friday, May 3, 2024

అన్నమయ్య కీర్తనలు : మందరధర మధుసూదన

మందరధర మధుసూదన
నందగోపనందనా || మందరధర మధుసూదన ||

నరసింహ గోవింద నవనీతానంద
హరిముకుంద నయనారవింద
కరివరద గరుడగమనరూప
గురుచాపా యదుకులదీపా || మందరధర మధుసూదన ||

భవదూర భయహర పరిపూర్ణామృత
భవనపాలన సురపాలన
భువనభూషణ పరమపురుష పురాతన
నవభోగా కరుణాయోగా || మందరధర మధుసూదన ||

పంకజాసననుత భవ్యనిర్మలపాద –
పంకజ పరమ పరాత్పర
వేంకటశైలనివేశ శు-
భంకరా క్షేమంకరా || మందరధర మధుసూదన ||

Advertisement

తాజా వార్తలు

Advertisement