Sunday, April 28, 2024

పంచె క‌ట్టులో సల్మాన్.. వెంక‌టేష్.. రామ్ చ‌ర‌ణ్‌

ఎల్లో ష‌ర్ట్..తెల్ల‌టి పంచెలో మెరిశారు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్.. వెంక‌టేశ్..కాగా వీరితో పాటు ఓ పాట‌లో జాయిన్ అయ్యాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. స‌ల్మాన్ ఖాన్ తాజా చిత్రం కిసీ కా భాయ్ .. కిసీ కి జాన్..ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగానే ఈ సినిమా నుంచి మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఏంటమ్మా ఏంటమ్మా అంటూ సాగే ఈ పాటను సల్మాన్ .. వెంక‌టేశ్ .. పూజ హెగ్డే బృందంపై చిత్రీకరించారు. తెలుగు .. హిందీ భాషలను మిక్స్ చేసి వదిలిన పాట ఇది. పాయల్ దేవ్ కంపోజ్ చేసిన ఈ పాట మాస్ బీట్ తో నడుస్తుంది. ల్లో షర్టులు .. తెల్లని లుంగీలు .. బ్లాక్ కలర్ షూ .. స్పెట్స్ తో సల్మాన్ – వెంకీ కనిపించారు. ఇక మిగతా బృందంలో లేడీస్ అంతా చీరకట్టులో నగలు ధరించి .. స్పెట్స్ తో కనిపిస్తున్నారు. తమిళ సంప్రదాయాన్ని టచ్ చేస్తూ ఈ పాట కొనసాగడం విశేషం. ఈ పాట మధ్యలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి .. మాస్ స్టెప్పులతో సందడి చేశారు. అటు వెంకీ .. ఇటు చరణ్ ఇద్దరూ కూడా సల్మాన్ కి మంచి స్నేహితులు అన్న సంగ‌తి తెలిసిందే.ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించనుంది.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement