Monday, May 6, 2024

వాంటెడ్‌ పండుగాడ్.. పట్టుకుంటే కోటి నజరానా

సునీల్‌, అనసూయ, బ్రహ్మానందం, సుడిగాలి సుధీర్‌ ప్రధాన పాత్రధారులుగా ‘వాంటెడ్‌ పండుగాడ్‌’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీధర్‌ సిపాన దర్శకుడు. సాయిబాబ కోవెలమూడి, వెంకట్‌ కోవెలమూడి నిర్మాతలు. అయితే.. పట్టుకుంటే కోటి అనేది ఈ మూవీకి ఉప శీర్షిక. ఇందులో సుడిగాలి సుధీర్‌ ఓ కీలక పాత్రధారిగా తెలుస్తోంది. ఆయన ప్రత్యేక పోస్టర్‌ విడుదల చేశారు.

ఈ చిత్రానికి జనార్ధన మహర్షి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మారేడుమిల్లి వద్ద పెద్ద షెడ్యూల్‌ పూర్తిచేసారు. మరికొంత హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీక‌రించారు. దాంతో షూటింగ్‌ దాదాపుగా పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించే అవ‌కాశం ఉంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం మహిరెడ్డి పండుగుల, సంగీతం పిఆర్‌. సమర్పణ కె.రాఘవేంద్రరావు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement