Saturday, October 5, 2024

Vyooham | మార్చ్ ఒకటో తేదీకి వ్యూహం వాయిదా..

టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలు గత ఏడాది డిసెంబర్ లోనే ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉంది.. అయితే చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా తెరకెక్కించారని నారా లోకేశ్ హైకోర్టులో కేసు వేయడంతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇటీవలే ఈ మూవీ రిలీజ్ కి కోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ‘వ్యూహం’ని ఫిబ్రవరి 23న, ‘శపథం’ని మార్చి 1న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఇక రేపు వ్యూహం రిలీజ్ కాబోతుంది అనుకుంటున్న సమయంలో.. ఇప్పుడు మళ్ళీ పోస్టుపోన్ చేస్తున్నట్లు వర్మ ట్వీట్ చేశారు. వ్యూహం సినిమాని మార్చి 1న, శపథం మూవీని మార్చి 8న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కొన్ని టెక్నికల్ కారణాలు, థియేటర్లు ఏర్పాటు వలనే వాయిదా వేయడం జరుగుతుందని ఆర్జీవీ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement