Tuesday, September 21, 2021

తండ్రి అయిన ఆర్య…హీరో విశాల్ ఎమోషనల్ ట్వీట్

తమిళ హీరో ఆర్య గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గా కూడా నటిస్తున్నాడు. తెలుగులో అల్లు అర్జున్ వరుడు సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు ఆర్య. అయితే ఆర్య 2019 మార్చి 10న సయేషా సైగల్ ను వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత సయేషా సినిమాలకు దూరమైంది. పైగా కరోనా వల్ల ఎక్కడా బయటకు కూడా రాలేదు. దీంతో ఆమె గర్భవతి అనే విషయం కూడా ఎవరికీ తెలియలేదు.

తాజాగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి ఆర్య సన్నిహితులు స్టార్ హీరో విశాల్ ప్రకటించారు. ఈ వార్తను బ్రేక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అంకుల్ గా ఉన్నందుకు చాలా బాగుంది. నా బ్రో జమ్మి ఆర్ బ్లాస్డ్ #బేబీ గర్ల్…కంట్రోల్ చేసుకోలేని భావోద్వేగాలు ఇప్పుడు షూట్ మధ్యలో ఉన్నాయి అంటూ విశాల్ ట్వీట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News