Sunday, May 12, 2024

షూటింగ్ లో విశాల్ కు మరోసారి గాయాలు

తమిళ స్టార్ హీరో విశాల్ కు షూటింగ్ లో మరోసారి గాయాలయ్యాయి. విశాల్ ప్రస్తుతం విశాల్ నాట్ ఎ కామన్ మ్యాన్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో గతంలో తల, కన్ను భాగంలో గాయాలయ్యాయి. తాజాగా ఇప్పుడు వెన్నుముక కు దెబ్బ తగిలింది.

కాగా వెంటనే చిత్రయూనిట్ విశాల్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపినట్లు సమాచారం. శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో ప్రస్తుతం జరుగుతోంది. క్లైమాక్స్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. కొన్ని పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement