Friday, May 3, 2024

కొరటాలకు నో చెప్పిన దేవరకొండ- కారణం ఏంటో తెలుసా ?

కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మరో సినిమా చేయబోతున్నాడు. అయితే ఇటీవల విజయ్ దేవరకొండ తో కొరటాల శివ ఓ సినిమా చెయ్యటానికి సిద్ధం అయ్యాడట. కానీ విజయ్ మాత్రం నో చెప్పాడట.

పూర్తి వివరాల్లోకి వెళితే యువసుధ ఆర్ట్స్ అధినేత సుధాకర్ మిక్కిలినేని తో కొరటాల శివ కు మంచి సంబంధాలు ఉన్నాయి. భవిష్యత్తులో కొరటాల శివ రూపొందించబోయే చిత్రాలను యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తోంది. అయితే యువసుధ ఆర్ట్స్ బ్యానర్లో లో దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో ఓ ప్రాజెక్టును సెట్ చేశాడట కొరటాల. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ తో మీటింగ్ ఏర్పాటు చేయడానికి కొరటాల శివ ప్రయత్నించగా.. విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశాడట. కొరటాల శివ ఆఫర్ ను తిరస్కరించడానికి డేట్స్ కారణమని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ రాబోయే రెండేళ్లకు కూడా కొన్ని సినిమాలను లైన్ లో పెట్టాడట. కాబట్టి కొత్తగా వచ్చే ఆఫర్స్ ను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరట. దీంతో మరో హీరోని వెతుక్కునే పనిలో దర్శక నిర్మాతలు పడ్డారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement