Friday, May 3, 2024

విలక్షణ నటుడికి హ్యాపీ బర్త్ డే

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు రూటే సెపరేటు. డైలాగ్ కొడితే ఆయనే కొట్టాలి. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, విద్యాసంస్థల అధినేతగా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసిన మోహన్ బాబు పుట్టిన రోజు నేడు. నలభై ఐదేళ్ల ఏళ్ల క్రితం ‘స్వర్గం నరకం’తో మొదలైన కలెక్షన్ కింగ్ నట ప్రస్థానం..నేటికి కొనసాగుతోంది. మోహన్ బాబు 69 ఏళ్లు నిండి 70 వసంతాలలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబుకు సోషల్ మీడియా ద్వారా ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మోహన్ బాబు నటించిన సినిమాల్లోని అన్ని ఫోటోలతో కలిపి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మంచు మనోజ్. మా పెదరాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఫోటో షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement