Friday, April 19, 2024

తమిళ్ లో వకీల్ సాబ్…మాములుగా ఉండదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు మంచి కలెక్షన్లు కూడా సాధించింది. ఈ సినిమాలో పవన్ సరసన శృతి హసన్ హీరోయిన్ గా నటించగా… అనన్య, నివేద థామస్, అంజలి కీలక పాత్రలో నటించారు.

అయితే తమిళ, హిందీ సినీ అభిమానులు వకీల్ సాబ్ చిత్రం డబ్బింగ్ వెర్షన్ కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళ ఆడియన్స్ కోసం సిద్ధం అయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం తాలూకా తమిళ్ డబ్ రైట్స్ ని విజయ్ టీవీ వారు కొనుగోలు చేసి ఆల్రెడీ డబ్బింగ్ చేసి సెన్సార్ ని కూడా పూర్తి చేసినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement