Tuesday, October 8, 2024

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్… మాములుగా ఉండదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వకీల్ సాబ్. అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్స్ , పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బోనికపూర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే .

కాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్నట్లు తెలుస్తోంది. యూసఫ్ గూడా లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఏప్రిల్ 3న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. త్వరలోనే అందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభం కాబోతున్న ట్లు తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement