Friday, May 3, 2024

Trailer – కామెడీ…ఎమోష‌న్స్ తో షారూక్.. తాప్సీల ‘డంకీ’ ట్రైల‌ర్

YouTube video

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్ హిందీ సినీ పరిశ్రమ సంక్షోభంలో ఉన్న సమయంలో పఠాన్‌, జవాన్‌ అంటూ వచ్చి వరస హిట్స్‌తో తనేంటో నిరూపించుకున్నాడు. ఒకే ఏడాదిలో రెండు బ్లాక్‌బస్టర్‌ సినిమాలతో వచ్చిన షారుక్‌.. ఇప్పుడు డంకీతో మూడో హిట్‌ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.

షారుక్ ఖాన్ వాయిస్‌ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్‌.. మూడు నిమిషాల పాటు సాగింది. ఇంగ్లీష్‌ నేర్చుకుని లండన్‌లో సెటిల్‌ అవ్వాలని కలలు కనే ఓ గ్రామీణ యువకుడి పాత్రలో షారుక్‌ కనిపించాడు. అతనితో పాటు మరో నలుగురు స్నేహితులు లండన్‌ వెళ్లడం కోసం ఇంగ్లీష్‌ నేర్చుకునేందుకు ప్రయత్నించడం, వీసా రాక ఇబ్బందులు ఎదుర్కోవడం నవ్వు తెప్పించాయి. వీసా ఇంటర్వ్యూల్లో ఫెయిల్‌ కావడంతో ఎలాగైనా లండన్‌ వెళ్లేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ క్రమంలో వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనేది స్టోరీ అన్నట్లుగా ట్రైలర్‌ చూస్తే కనిపిస్తున్నది. కామెడీతో పాటు ఎమోషన్స్‌ కలగలిపిన సీన్స్ తో ద‌ర్శ‌కుడు హిరాణి మంచి స్ట‌ఫ్ ను అందించాడు.. షారూక్ తో తొలిసారి తాప్సీ ప‌న్ను జ‌త‌క‌ట్ట‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement