Wednesday, May 1, 2024

గోపీచంద్ సిటిమార్ రిలీజ్ వాయిదా !!

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సీటిమార్. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఇందులో గోపీచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టుకు కోచ్ గా నటించనున్నారు. తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా కనిపించనున్నారు. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ డేట్ ఫిక్స్ చేసింది.

కానీ ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. అదేరోజున కింగ్ నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్, కార్తీ సుల్తాన్ కూడా విడుదలవుతున్నాయి. మరో వైపు కూడా మరుసటి వారం ఏప్రిల్ 9న విడుదల వకీల్ సాబ్ రిలీజ్ కాబోతోంది. విడుదల తేది దగ్గర పడుతున్నప్పటికీ ప్రమోషన్స్ మాత్రం ఇప్పటివరకు చిత్రయూనిట్ స్టార్ట్ చేయలేదు. దీంతో సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్ ఎప్పుడు చేస్తారని మాత్రం క్లారిటీ గా చిత్ర యూనిట్ ప్రకటించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement