Thursday, May 2, 2024

తమిళనాట ‘రంగస్థలం’ రిలీజ్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు రంగస్థలం సినిమా ఎంతటి హిట్ ని ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో నటుడిగా రామ్ చరణ్ కి మంచి గుర్తింపు వచ్చింది. అదే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ను కూడా ఈ సినిమా కొల్లగొట్టింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడి గా అద్భుతంగా నటించాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా ఆల్రెడీ కన్నడలో విడుదల కాగా….ఇప్పుడు తమిళంలో కూడా విడుదలకు రెడీ అవుతోంది.

తమిళ మేకర్స్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ కు టైం ఫిక్స్ చేశారు. సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఈ చిత్రం తాలూకు ట్రైలర్ ను నిర్మాణ సంస్థ 7జి ఫిల్మ్స్ వారు రిలీజ్ చేయడానికి రెడీ చేశారు. ఇక ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించగా… దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. తమిళ్ లో ఏప్రిల్ 30 న విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement