Friday, April 26, 2024

ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడి…ఉదయం10 గంటలకు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమురంభీం టైగర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొమరం భీమ్ కు సంబంధించిన అప్డేట్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయబోతోంది. రేపు ఉదయం 10 గంటలకు ఈ అప్డేట్ ను రిలీజ్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఈమేర అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది చిత్ర యూనిట్. గతంలో రామ్ చరణ్ పుట్టినరోజు కి అల్లూరి సీతారామరాజు లుక్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement