Sunday, May 5, 2024

ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్..

ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు MM కీరవాణి చిన్న కుమారుడు సింహ కోడూరి నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘‘భాగ్ సాలే’’ గత నెల (జూలై) 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. దర్శకుడు ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీలో నేహా సోలంకి హీరోయిన్ గా నటించింది. కాగా, ఈ సినిమా ఇవ్వాల ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అయిన‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వ‌చ్చేసింది.

ఇక ఈ సినిమాలో రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి సౌందరరాజన్, నందిని రాయ్, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రలు పోషించారు. బిగ్ బెన్ సినిమాస్, సినీవాలీ మూవీస్‌తో కలిసి వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ మూవీకి కాల భైరవ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement