Thursday, April 25, 2024

ది ఇండియా హౌస్ టైటిల్ టీజర్ కి.. 10మిలియన్ల‌ వ్యూస్

ది ఇండియా హౌస్ మూవీ టైటిల్ టీజ‌ర్ కి 10మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. స్వాతంత్య్రోద్యమాన్ని ముందుడి నడిపించిన అమర వీరుల చుట్టే తన సినిమాలను ప్లాన్ చేసుకుంటూ.. త్రూ అవుట్ ఇండియా ట్రెండ్ అవుతున్నారు యంగ్ హీరో నిఖిల్. భగ‌త్ సింగ్ బ్యాక్ డ్రాప్ లో స్పై మూవీని చేస్తూనే.. మరో పక్క వీర్‌ సావర్కర్ నేపథ్యంలో ది ఇండియా హౌస్‌ సినిమాను చేస్తున్నారు. తాజాగా ఓ టైటిల్ టీజర్‌ కూడా రిలీజ్ చేశారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమర్పిస్తున్న ఈ మూవీ టీజరే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. షేక్ చేయడమే కాదు.. రికార్డులు కూడా క్రియేట్ చేస్తోంది ఈ వీడియో.దాదాపు యూట్యూబ్‌తో పాటు.. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను కలుపుకుని ది ఇండియా హౌస్‌ టీజర్‌ దాదాపు 10 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది. అంతేకాదు చిన్న టైటిల్ టీజర్‌ తోనే.. విపరీతంగా అంచనాలు పెరిగేలా చేసుకుంది. రామ్‌ చరణ్ క్రేజ్‌ కూడా యాడై.. త్రూ అవుట్ ఇండియా ట్రెండ్ అవుతోంది. మరి ఈ సింబీమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో అక్కట్టుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement