Friday, April 26, 2024

Memorable Photo – కవిత, బండి సంజయ్ ల మాటా మంతి…

నిజ‌మాబాద్ తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తోన్న బీజేపీ.. సీఎం కేసీఆర్‌ను , ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది. హరీశ్ రావు, కేటీఆర్, కవితలపై కాషాయ నేతలు నిత్యం విరుచుకుపడుతూ వుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎదురెదురుపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య నూతన గృహ ప్రవేశానికి ఈ ఇద్ద‌రు నేత‌లు హాజరయ్యారు. అక్కడ ఎదురుపడటంతో ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయాలను పక్కనబెట్టి ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్‌కు నిజామాబాద్ జిల్లా నేతలను పరిచయం చేశారు కవిత. అటు బండి సంజయ్ కూడా తమ నేతలను కవితకు పరిచయం చేశారు. దీంతో మీడియా ప్రతినిధులు కెమెరాలకు పనిచెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement