Friday, May 3, 2024

నిశ్చితార్థం రద్దు… ఇకపై తనతో సంబంధం లేదు – హీరోయిన్ మెహరీన్

హీరోయిన్ మెహరీన్ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో మెహరీన్ కు పెళ్లి కుదిరింది. ఈ నేపథ్యంలోనే నిశ్చితార్థం కూడా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపింది మెహరిన్.

ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. బిష్ణోయ్, తాను ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయానికి వచ్చామని ఇక నుంచి తన కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పుకొచ్చింది. అందరూ ఈ విషయాన్ని గౌరవిస్తారని ఆశిస్తూ… సినిమాలు ఇక పై చేస్తూనే ఉంటానని క్లారిటీ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement