Sunday, May 5, 2024

Thalapathy68.. అప్ డేట్

త‌న 67వ చిత్రంతో బిజీగా ఉన్న త‌మిళ స్టార్ హీరో విజ‌య్ తో తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సూపర్ గుడ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్ దళపతి 68ను తెరకెక్కించనుంది. విజయ్‌ హీరోగా నటించనున్న ఈ చిత్రం సూపర్ గుడ్‌ ఫిలిమ్స్ కు 100వది కావడం విశేషం. ఇప్పటివరకున్న టాక్ ప్రకారం స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు నటి మిషా ఘోషల్ అట్లీతో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. ధన్యవాదాలు అట్లీ సార్‌ అంటూ #Thalapathy68 హ్యాష్‌ ట్యాగ్ జోడించింది. దీంతో దళపతి 68లో మిషా ఘోషల్ కూడా నటించబోతుందని తెలిసిపోతుంది. దళపతి 68కి సంబంధించి సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.విజయ్ ప్రస్తుతం స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దళపతి 67 తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. లియో టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా ఇప్పుడు దళపతి 68 సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది.

https://twitter.com/iamMishaGhoshal/status/1650426385385795586
Advertisement

తాజా వార్తలు

Advertisement