Friday, June 14, 2024

Poster Relese: తేజ సజ్జా కొత్త కబురు

‘ హనుమాన్‌’ ఫేమ్‌ తేజ సజ్జ నటిస్తున్న తాజా చిత్రాన్ని కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. టీజీ. విశ్వప్రసాద్‌ నిర్మాత. పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న చిత్రమిది. తాజాగా తేజ సజ్జ బ్లాక్‌ ఫోజ్‌ పోస్టర్‌ విడుదల చేశారు.

తన దుస్తులుమంటల్లో అంటుకోవడం పోస్టరులో గమనించవచ్చు. ఈ సినిమా టైటిల్‌ను 18వ తేదీన ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను కూడా అదే రోజున వెల్లడిస్తారు. ఈ చిత్రానికి సహ నిర్మాత వివేక్‌ కూబొట్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ కృతి ప్రసాద్‌, రచన మమిబాబు కరణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement