Wednesday, May 1, 2024

Superhero Hanuman | హనుమాన్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ !

తేజ సజ్జ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాని బిగ్ స్క్రీన్‌లపై చూసేందుకు సినీ ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన హనుమాన్ చాలీసా పాటకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా, మేకర్స్ ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ “సూపర్ హీరో హనుమాన్” ను విడుదల చేసారు.

YouTube video

అనుదీప్ దేవ్ కంపోజ్ చేసిన పాటకి, కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. ఈ సాంగ్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హనుమాన్ సినిమా 2024 జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ మరియు జపనీస్ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement