Friday, May 10, 2024

SSMB28 ఫొటో లీక్.. మ‌హేశ్.. పూజ లుక్ అదిరిందిగా

ఈ మ‌ధ్య‌కాలంలో ప‌లు చిత్రాల షూటింగ్స్ నుండి ఫొటోలు.వీడియోలు లీక్ అవ్వ‌డం చూస్తూనే ఉన్నాం.. కాగా స్టార్ హీరో మహేశ్ బాబు – ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ సినిమా నుండి ఫొటోలు లీక్ అయ్యాయి. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూళ్లతో మూవీని పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకోగా తాజాగా మరో షెడ్యూల్ కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.ఈ మూవీ సెట్స్ నుంచి పలుమార్లు ఫొటోలు లీక్ అవుతూనే ఉన్నాయి. దీంతో మహేశ్ లుక్స్, గెటప్, లోకేషన్లకు సంబంధించిన వివరాలు ముందుగానే తెలిసిపోతున్నాయి. ఇది ఒక రకంగా చిత్ర యూనిట్ కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే కొన్ని ఫొటోలు లీకై నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈసారి మహేశ్ బాబు, పూజా హెగ్దే, త్రివిక్రమ్ కలిసి ఉన్న ఫొటో నెట్టింట చేరింది. వరుసగా లీకుల పర్వం కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ పిక్ లో మహేశ్ బాబు గ్రీన్ చెక్స్ షర్ట్ లో కనిపిస్తున్నారు. మ‌హేశ్ పక్కనే ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ పూజా హెగ్దేకు సీన్ వివరిస్తున్నారు. పూజా రెడ్ లెహంగా వోణీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. వారి చుట్టూ అన్ని క్యాస్ట్యూమ్స్ కనిపిస్తుండటం చూడవచ్చు. ఇప్పుడీ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement