Saturday, July 27, 2024

మరో యాక్షన్ మూవీకి సిద్ధమయిన…శ్రీకాంత్ అడ్డాల ?

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం నారప్ప. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ఓటీటీ లో రిలీజ్ అయింది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా సినిమాలు తీసే శ్రీకాంత్ అడ్డాల… తనలో ఉన్న మరో కోణాన్ని కూడా ఈ సినిమాలో చూపించాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం శ్రీకాంత్ అడ్డాల మరో యాక్షన్ డ్రామా ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఒక పీరియాడికల్ డ్రామా గా తెరకక్కబోతున్నట్టు సమాచారం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement