Saturday, July 24, 2021

కొత్త మూవీ సెట్ లో అడుగుపెట్టిన రష్మీక

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు రష్మిక మందన్న. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు టాలీవుడ్ లో వరుస సినిమాలను చేసింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాలను చేస్తుంది రష్మిక. అయితే తాజాగా ఓ కొత్త సినిమా సెట్ లో అడుగుపెట్టింది ఈ అమ్మడు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఆడాళ్ళు మీకు జోహార్లు చిత్రం తాజాగా మొదలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ షూటింగ్ సెట్ లో శర్వానంద్ రష్మిక మందన పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. అలాగే శర్వానంద్ ఒకే ఒక జీవితం, మహా సముద్రం సినిమాలలో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News