Friday, April 26, 2024

సోనూసూద్ కు పద్మ విభూషణ్ ఇవ్వాలి….నటుడు బ్రహ్మాజీ డిమాండ్

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ పద్మ విభూషణ్ పురస్కారాన్ని సోనూసూద్ కు ఇవ్వాలని కోరారు. తన ప్రపోజల్ ను మీరంతా కూడా బలపరిచే టట్లు అయితే రీట్వీట్ చేయని బ్రహ్మజీ కోరారు. ఇక దీంతో చాలా మంది నెటిజన్లు బ్రహ్మాజీ ట్వీట్ ని రీట్వీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక సోనూసూద్ దృష్టికి కూడా ఈ విషయం చేరింది. దాంతో సోనూసూద్ స్పందించారు. 135 కోట్ల మంది భారతీయుల ప్రేమే నాకు పెద్ద అవార్డు…దానిని ఇప్పటికే పొందాను. మీ అభిమానానికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక కరోనా కష్టకాలంలో ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. వలస కార్మికులకు తమ స్వగ్రామాలకు తరలించి దేవుడయ్యాడు. అలాగే కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంతోపాటు ఎంతోమందికి ప్రాణాలను నిలబెట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement