Saturday, June 22, 2024

హిందీ రీమేక్ లో శ్యామ్ సింగ‌రాయ్ .. బాలీవుడ్ కి టాలీవుడ్ హీరో ..

క‌ల‌క‌త్తా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగ‌రాయ్. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌నున్నార‌ట‌. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక హిందీలో ఈ సినిమాను రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ కి చెందిన ఒక హీరో ఈ రీమేక్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నాడ‌ని స‌మాచారం. కాగా తెలుగులో నేచుర‌ల్ స్టార్ నాని న‌టించాడు. హీరోయిన్స్ గా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాహుల్ సాంకృత్యన్ తెర‌కెక్కిస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి నిర్మాత‌. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. అలాగే ప్రమోషన్స్ లో వేగం పెంచే దిశగా కూడా పనులు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement