Thursday, April 25, 2024

మాస్ మసాల ‘సీటీమార్‌’ ట్రైలర్ వచ్చేసింది..

యాక్షన్ హీరో గోపిచంద్ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో వస్తున్న మూవీ సీటిమర్. ఈ మూవీ ట్రైలర్’ను రామ్ పోతినేని తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే.. స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న మాస్ యాక్షన్ ఫిల్మ్‌లా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న కొందరి యువతులను ఎలా ఛాంపీయన్స్‌గా మార్చారడం కోసం హీరో దానికోసం ఎలాంటీ కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనేది కథగా కనిపిస్తోంది. ‘రూల్స్‌ ప్రకారం పంపిస్తే ఆడి వస్తారు, రూట్‌ లభించి ఆలోచించి పంపిస్తే పేపర్‌లో వస్తారు’ అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్ గోవిచంద్ మాస్ అప్పీయరెన్స్ లుక్ అదిరింది. గోపిచంద్ చేస్తున్న ఫైటింగ్స్ మాస్ ఆడియన్స్ తో సీటీమార్ వేయించేలా ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా నటిస్తున్నారు. మూవీలో మిల్కీబ్యూటి తమన్నాతో పాటు మరో హీరోయిన్‌గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. సెప్టెంబర్‌ 10 సినిమా రిలీజ్ కానుంది. మరి వీరి కూత ఎంత స్ట్రాంగ్ వినిపిస్తోందో తెలియాలంటే అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే.

YouTube video

ఇది కూడా చదవండి: ‘ఈనాడు’కు కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా

Advertisement

తాజా వార్తలు

Advertisement