Sunday, June 16, 2024

Kajal Aggarwal : స‌త్యభామ వ‌చ్చేస్తోందిరోయ్….

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కెరీర్ ఫుల్ ఫామ్ లో వున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకోని కాజల్ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది .గత ఏడాది బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది.

- Advertisement -

ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ప్రస్తుతం కాజల్ వరుస సినిమాలతో బిజీ గా వుంది.ఇదిలా ఉంటే కాజల్ నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ “సత్యభామ”..

ఇందులో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించింది.ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ,సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించాడు.క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ వంటి తదితరులు ముఖ్య పాత్ర పోషించారు.ఇదిలా వుంటే ఈ సినిమా రిలీజ్ మే నెలాఖరున అంటే మే 31 ఉంటుందని అంతా భావించారు.తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.సత్య భామ మూవీ “జూన్ 7 ” న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement