Saturday, December 7, 2024

కథాకేళితో సతీశ్‌ వేగేశ్న కొత్త ప్రయత్నం

శతమానం భవతి ఆర్ట్స్‌ పతాకంపై రచయిత సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కథా కేళి’. ఈ సినిమా టీ-జర్‌ విడుదల వేడుకలో కథా కేళి సినిమా లోగోను నిర్మాత దిల్‌ రాజు, టీ-జర్‌ను దర్శకుడు హరీశ్‌ శంకర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా… నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ శతమానం భవతి సినిమా మా బ్యానర్‌లో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడదే పేరుతో సతీశ్‌ బ్యానర్‌ పెట్టటం చాలా సంతోషంగా ఉంది. ‘కథా కేళి’ టీ-జర్‌ చూస్తుంటే సతీశ్‌ కొత్త ప్రయత్నం చేసినట్లు- అనిపించింది. అన్నారు.

హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లి మన అందరినీ గర్వపడేలా చేసిన సినిమా శతమానం భవతి. సతీశ్‌గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అన్నారు.
చిత్ర సమర్పకుడు చింతా గోపాల కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాలో నాకు కూడా భాగస్వామ్యం కల్పించిన సతీశ్‌గారికి థాంక్స్‌ అన్నారు.
చిత్ర దర్శకుడు సతీశ్‌ వేగేశ్న మాట్లాడుతూ నేను పరిశ్రమకు వచ్చి పాతికేళ్లు అవుతుంది. ఈరోజు వరకు రైటర్‌, డైరెక్టర్‌గా నిలబడ్డాను. కోవిడ్‌ వల్ల నేను స్టార్ట్‌ చేసిన కోతి కొమ్మచ్చి, శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. ఈ గ్యాప్‌లో ఓ కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమా చేద్దామని చేసిన సినిమానే ఈ కథాకేళి. దెయ్యానికే కథ చెప్పాల్సి వస్తే.. అనేదే మా కథా కేళి సినిమా. ఇప్పటి యూత్‌కు నచ్చే కథ, అందరినీ నవ్వించే హారర్‌కామెడీ ఉంది. అన్నారు.
సంగీత దర్శకుడు ఎస్‌.కె.బాలచంద్రన్‌, సినిమా టోగ్రాఫర్‌ దాము నర్రావు, పూజితా పొన్నాడ , అజయ్‌, నందిని, నటు-డు యశ్విన్‌, దినేశ్‌ తేజ్‌ తదితరులు సినిమా విజయాన్నికాంక్షిస్తూ మాట్లాడారు.
ఈ చిత్రంలో యశ్విన్‌, దినేశ్‌ తేజ్‌, అజయ్‌, బాలాదిత్య, పూజితా పొన్నాడ, నందిని, ఆయుషి, ప్రీతి, విరాట్‌ తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement